How can I be in this world without you Mounika Army jawan unable to bear the death of his wife

He is an army jawan. He is performing the responsibilities of national defense with perfection. He got married last year. A relationship made by adults. A girl from her village. The people saw the couple and said how good Edu and Jodu are. They were determined to be cool with rowdy children. Even though he is in a different state as part of his duty, he always inquires about the well-being of his parents and wife. Seeing the mutuality of the couple, the fate got its eye.. both of them were sacrificed. When his wife died of illness, the husband committed suicide as he could not bear the separation without her. This heartbreaking incident took place in Kogunuru mandal of Srikakulam district.

According to the details disclosed by the police, 27-year-old Mangaraju Rajababu, a resident of Isarlapeta village of Amadalavalasa mandal, joined the Indian Army in 2016. He got married to Maunika from the same village in February last year. Rajababu is currently working in Haryana. Maunika is seven months pregnant. Rajababu's father Satyanarayana admitted her to the army hospital in Visakhapatnam due to her recent health issues. Rajababu came home on leave as soon as he came to know about the matter. He did all human efforts to save his wife. But fate was not kind. Maunika died on the 16th as her condition worsened.

Rajababu, who was deeply saddened by the death of his wife, fell ill after not even eating properly. On 19th of this month, he left home saying that he will come after seeing him at the hospital. He boarded the train in Amadalavalasa and got off at Guntur. When he sent a message to his friends that he was in Guntur and was dying there, they immediately got worried and informed the Guntur police. Friends and relatives searched the railway tracks in Kogunuru on Wednesday morning. Finally, at 11 o'clock, after receiving information that a young man had died in a garden near Konchada, he went there and found him hanging from a tree. With this, the parents wept bitterly. Police have registered a case and are investigating.

Telugu version 

అతడు ఆర్మీ జవాన్. దేశ రక్షణ బాధ్యతలను అంత:కరణ శుద్ధితో  నిర్వర్తిస్తున్నాడు. గత ఏడాదికి అతడికి పెళ్లి అయ్యింది. పెద్దలు కుదర్చిన సంబంధం. తన గ్రామానికి చెందిన అమ్మాయే. ఆ దంపతులను చూసి ఈడు, జోడు ఎంత బాగుందో అనేవారు జనాలు. కలకలం పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ధీవించేవారు. డ్యూటీలో భాగంగా వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికీ.. తల్లిదండ్రులు, భార్య యోగక్షేమాలు ఎప్పుటికప్పుడు తెలుసుకునేవాడు అతడు. ఆ దంపతుల అన్యోనత చూసి ఆ విధికి కన్ను కుట్టిందో ఏమో.. ఇద్దర్నీ బలి తీసుకుంది. అనారోగ్యంతో భార్య మరణించగా.. ఆమె లేని ఎడబాటును తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా  పొందూరు మండలంలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం ఈసర్లపేట గ్రామానికి చెందిన 27 ఏళ్ల మంగరాజు రాజబాబు.. 2016లో భారత సైన్యంలో చేరాడు. గత ఏడాది ఫిబ్రవరిలో అతడికి అదే గ్రామానికి చెందిన మౌనికతో పెళ్లి జరిగింది. కాగా రాజబాబు ప్రజంట్ హర్యానాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మౌనిక ఏడు నెలల ప్రెగ్నెంట్. ఆమెకు ఇటీవల హెల్త్ ఇష్యూస్ రావడంతో రాజబాబు తండ్రి సత్యనారాయణ.. విశాఖపట్నంలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చించాడు. విషయం తెలిసిన వెంటనే  సెలవుపై ఇంటికి వచ్చాడు రాజబాబు. భార్యను బతికించుకునేందుకు మానవ ప్రయత్నాలు అన్నీ చేశాడు. కానీ విధి కరుణించలేదు. పరిస్థితి విషమించడంతో 16వ తేదీన మౌనిక మృతి చెందింది.

భార్య మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజబాబు.. సరిగ్గా భోజనం కూడా చేయకపోవడంతో.. అనారోగ్యానికి గురయ్యాడు.  ఈనెల 19న ఆసుపత్రిలో చూయించుకుని వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఆమదాలవలసలో ట్రైన్ ఎక్కి పొందూరులో దిగాడు. తాను పొందూరులో ఉన్నానని, అక్కడే చనిపోతున్నానని ఫ్రెండ్స్‌కు సందేశం పంపడంతో వెంటనే వారు ఆందోళన చెంది విషయాన్ని పొందూరు పోలీసులకు సమాచారమిచ్చారు. మిత్రులు, బంధువులు బుధవారం ఉదయాన్నే పొందూరులోని రైల్వే ట్రాక్స్‌పై వెతికారు. చివరకు 11 గంటల సమయంలో కొంచాడ సమీపంలోని తోటలో ఓ యువకుడు మృతి చెందినట్లు సమాచారం రావడంతో.. అక్కడి వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens