The suicide of CI Ananda Rao in Tadipatri of Anantapur district filled the tragedy. Ananda Rao, who was on duty as a night alerting officer, committed suicide by hanging himself at home. They got off duty like this and went home like this.. What happened in this gap? What are the difficulties that can take lives? Work pressure..? Financial difficulties? The real reasons behind Ananda Rao's suicide have become a mystery. Police job in Tadipatri is full of challenges. There is a talk that along with work pressure, there are also political pressures.
Whatever the problem is, the ruling opposition leaders criticize the police as a target. That's why performing duties here means the police hold their heads. But it is not known what happened at night.. Ananda Rao committed suicide shortly after coming from duty. Ananda Rao's daughter expressed her grief that her father's death was due to work pressure.
The police went to Ananda Rao's house after receiving the information about suicide. The family members were asked for details. Speaking to TV9, SP Srinivas said that Ananda Rao committed suicide due to family differences and financial difficulties. The allegations of the family members have nothing to do with the arguments of the police. Why did Ananda Rao commit suicide? It has now become a mystery.
Teugu version
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీఐ ఆనందరావు ఆత్మహత్య విషాదం నింపింది. నైట్ అలర్టింగ్ ఆఫీసర్‌గా డ్యూటీ చేసి ఇంటికెళ్లిన ఆనందరావు.. ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఇలా డ్యూటీ దిగి అలా ఇంటికెళ్లారు.. ఈ గ్యాప్‌లో ఏం జరిగింది? ప్రాణాలు తీసుకునేంత ఇబ్బందులు ఏమై ఉంటాయి? పని ఒత్తిడా..? ఆర్థిక ఇబ్బందులా? ఆనందరావు ఆత్మహత్య వెనుక అసలు కారణాలేంటన్నది మిస్టరీగా మారింది. తాడిపత్రిలో పోలీస్ ఉద్యోగం అంటే సవాళ్లతో కూడుకున్నది. వర్క్ ప్రెజర్‌తో పాటు రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉంటాయనే టాక్ వినిపిస్తూ ఉంటుంది.
సమస్య ఏదైనా ఎలాంటిదైనా.. అధికార విపక్ష నేతలు పోలీసులే టార్గెట్‌గా విమర్శలు చేస్తుంటారు. అందుకే ఇక్కడ విధులు నిర్వహించడం అంటే పోలీసులు తలలు పట్టుకుంటారు. అయితే రాత్రి ఏం జరిగిందో తెలియదు.. డ్యూటీ నుండి వచ్చిన ఆనందరావు కొద్దిసేపటికే ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు. వర్క్ ప్రెజర్‌తోనే తన తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది ఆనందరావు కూతురు.
ఆనందరావు ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీవీ9తో మాట్లాడిన ఎస్పీ శ్రీనివాస్ కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. కుటుంబసభ్యుల ఆరోపణలకి పోలీసుల వాదనకు ఎక్కడా పొంతనలేదు. మరి ఆనందరావు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు. ఇప్పుడిదే మిస్టరీగా మారింది.