English Version
The Indian Meteorological Department have revealed that there will be very heavy rains in AP and Telangana for the next three days. Officials of the Meteorological Center revealed that a surface circulation has formed in the north-west and adjoining west-central Bay of Bengal from the coasts of South Odisha and North AP. It has been mentioned that there will be moderate rains in many places and heavy rains in some places in Telangana and AP. IMD explained that heavy rains will occur in Coastal Andhra, Telangana and Yanam. Moderate rains or thundershowers are likely at many places during the rest of the day.
Especially today in Telangana, heavy to very heavy rains are likely to occur in Jagityala, Rajanna Sirisilla, Karimnagar, Peddapalli, Jayashankar Bhupalapalli, Siddipet and Kamareddy. Orange alert has been issued in these districts. Adilabad, Komuram Bhim Asifabad, Manchiryala, Nirmal, Nizamabad, Mulugu, Bhadradri Kothagudem, Mahabubnagar, Warangal Rural, Warangal Urban, Mahabubabad, Nagar Kurnool, Vanaparthi, Narayana Peta and Gadwala districts will experience heavy rains here and there. Orange alert has been issued in these districts today. But on the 9th, there is a possibility of heavy to very heavy rains in the districts of Mancheryala, Nirmal and Nizamabad. A red alert has been issued in these districts tomorrow.
Besides, torrential rains are falling in AP as well. He said that due to the effect of monsoon, there are chances of heavy to very heavy rains in some parts of the north coast within 24 hours. It is said that there will be moderate rains at several places on the south coast, heavy rains at one or two places, and light to moderate rains at Rayalaseema.
Telugu Version
రుతుపవనాలకుతోడు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. దక్షిణ ఒడిశా, ఉత్తర ఎపి తీరాల నుంచి వాయువ్య, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD వివరించింది. మిగతా రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా నేడు తెలంగాణలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్క భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాల్లో నేడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కానీ, 9న మాత్రం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. ఈ జిల్లాల్లో రేపు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
అటు, ఏపీలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్‌తో ఉత్తర కోస్తాలోని కొన్ని చోట్ల రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దక్షిణ కోస్తాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.