The war of words continues between the government and Governor Tamilisai Key over the construction of Osmania Hospital. In this order, Governor Tamilisai Soundararajan visited Osmania Hospital. Governor Tamilsai, who previously said on Twitter that the construction of Osmania's new building should be taken up as soon as possible, has now directly visited Osmania Hospital. On this occasion, they asked about the construction of Tamilisai building and other details.
The Deputy Officers explained the condition of the building to the Governor. Later he met the patients undergoing treatment at Tamilisai Hospital and spoke to them. They inquired about the facilities and medical treatment. Speaking to the media on this occasion, Governor Tamilisai made sensational comments. It is stated that the facilities in Osmania Hospital are not proper. Governor Tamil Sai made key comments that Neuro Ward does not even have a roof.
It is interesting that Governor Tamilisai, who previously said on Twitter that the construction of Osmania's new building should be taken up as soon as possible, is now directly visiting the hospital. Minister Harish Rao countered the Governor's earlier tweet. Minister Harish Rao asked whether the development in Telangana is not visible. The minister clarified that the government is ready for the construction of Osmania Hospital. The minister mentioned that we are silent because we are under the jurisdiction of the court.
There is already an issue of Governor vs. Government on the construction of Osmania's new building. A letter movement with 8 hundred letters is going on through Indian Post in the name of Justice for OGH demanding the construction of a new Osmania building. 400 letters were posted with CMO address. Another 400 letters were posted with the address of the Chief Justice High Court.
Telugu version
ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వానికీ గవర్నర్ తమిళిసై కీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఉస్మానియా నూతన భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలంటూ గతంలో ట్విట్టర్ వేదికగా పేర్కొన్న గవర్నర్ తమిళసై.. ఇప్పుడు నేరుగా ఉస్మానియా ఆసుపత్రిని విజిట్ చేశారు. ఈ సందర్భంగా తమిళిసై బిల్డింగ్ నిర్మాణం తదితర వివరాలను అడిగితెలుసుకున్నారు.
బిల్డింగ్ పరిస్థితిని డిప్యూటీ అధికారులు గవర్నర్ కు వివరించారు. అనంతరం తమిళిసై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలిసి వారితో మాట్లాడారు. సౌకర్యాలు, వైద్యం అందుతున్న తీరు.. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో వసతులు సరిగ్గా లేవంటూ పేర్కొన్నారు. న్యూరో వార్డులో పైకప్పు కూడా లేదంటూ గవర్నర్ తమిళ సై కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఉస్మానియా నూతన భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్న గవర్నర్ తమిళిసై.. ఇప్పుడు నేరుగా ఆసుపత్రిని విజిట్ చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో గవర్నర్ చేసిన ట్వీట్‌కి మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు మంత్రి. కోర్టు పరిధిలో ఉండడం వల్ల సైలెంట్‌గా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటికే ఉస్మానియా నూతన భవన నిర్మాణంపై గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం ఇష్యూ కాకరేపుతోంది. ఉస్మానియా నూతన భవనం నిర్మాణం డిమాండ్ చేస్తూ జస్టిస్ ఫర్ OGH పేరు తో ఇండియన్ పోస్ట్ ద్వారా 8 వందల లెటర్లతో లేఖల ఉద్యమం నడుస్తోంది. CMO అడ్రెస్ తో 400 లెటర్లు పోస్ట్ చేశారు. చీఫ్ట్ జస్టిస్ హై కోర్టు అడ్రెస్ తో మరో 400 లేఖలు పోస్ట్ చేశారు.