The authorities have taken a crucial decision for the safety of women in Hyderabad. Two She Shuttle free bus services have been started. DGP Anjani Kumar flagged off the free bus service on Friday. Cyberabad Police and Society for Cyberabad Security Council organized the 5th Women's Conclave and Awards in a grand manner at Rayadurgam JRC Convention Centre.
DGP Anjani Kumar was the chief guest for this program. CP Stephen Ravindra, SCSC Secretary Krishna Yedula and other senior police officers participated in the same program. This bus service is made with latest technology. All the facilities for women have been arranged in it. The organizers said that there will be a security guard in the bus for the safety of women.
This bus service is made with latest technology. All the facilities for women have been arranged in it. The organizers said that there will be a security guard in the bus for the safety of women. The organizers clarified that this bus will run twice in the morning and twice in the evening.
Telugu version
హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు షీ షటిల్ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. డీజీపీ అంజనీ కుమార్ ఉచితబస్సు సర్వీస్‌ను జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాయదుర్గం JRC కన్వెన్షన్ సెంటర్లో ఐదవ ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిధి డీజీపీ అంజనీ కుమార్ హాజరు కాగా.. సీపీ స్టీఫెన్ రవీంద్ర, scsc సెక్రటరీ కృష్ణ ఏదుల, పోలీసు ఉన్నతాధికారులు ఇదే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బస్సు సర్వీసు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు ఉంటారని నిర్వాహకులు తెలిపారు.
ఈ బస్సు సర్వీసు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు ఉంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు ప్రయాణిస్తుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.