Ghost Marraiges in Karnataka

The dowry is the dowry that comes to the dead man's marriage. This is a proverb. But that is a thing of the past. But actually it is not a proverb. literal truth An ancient tradition proves that the proverb did not originate in the village. A strange tradition of marrying ghosts and offering dowry gifts has recently come to light. It is not spirits but humans who attend the spirit weddings held here. This strange ghost marriage tradition is still practiced by some in Dakshina Kannada district. Read this interesting story if you want to know about the wedding ceremonies of those who died decades ago.

As part of these ceremonies, the bride and groom have to wear silk clothes given by their in-laws first. After marriage, the wedding begins. In this wedding ceremony, all eyes are not on the bride and groom. But actually there are no bride and groom. The chairs they sit on are covered with white cloths. The seven steps that the bride and groom have to take while going around it are taken by the people of that house. Thali, blessings and other wedding programs are now common. Not only family members but also locals, relatives and close friends attend this ceremony. So you doubt who this wedding is for. To the bridegroom who died sometime in Purit. Also, during childbirth, a girl who died at birth is searched for and married. You will not forget to see the traditions of seven generations in these ghost weddings. Caste, gotra, and rows are all prepared for the marriage. Otherwise there would be no real people. The ghosts that are happening now are 30 years old. It means that people who died three decades ago are now getting married. Except for the presence of the bride and groom, all the feasts and entertainments are normal.

Telugu Version

చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. ఇది సామెత. కానీ అది ఒకనాటి మాట. కానీ నిజానికి అది సామెత కాదు. అక్షర సత్యం. ఆ సామెత ఊరికినే పుట్టలేదని రుజువు చేస్తోంది ఓ పురాతన సాంప్రదాయం. ప్రేతాత్మలకి అట్టహాసంగా పెళ్లిళ్లు చేసి, కట్న కానుకలు పుచ్చుకునే ఓ విచిత్ర సాంప్రదాయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరిగే ఆత్మల పెళ్లిళ్లకు హాజరయ్యేది మాత్రం ఆత్మలు కాదు మనుషులే. ఈ వింత ప్రేతాత్మల పెళ్లిళ్ల సంప్రదాయం దక్షిణ కన్నడ జిల్లాలో కొందరు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం చచ్చిపోయిన తమ వారికి ఇప్పుడు పెళ్ళి చేసే వివాహ వేడుకల గురించి తెలియాలంటే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని చదవాల్సిందే. 

ఈ వేడుకల్లో భాగంగా ముందుగా అత్తింటివారిచ్చిన పట్టు వస్త్రాలను వధూవరులు ధరించాల్సి ఉంటుంది. పెట్టిపోతలయ్యాక పెళ్లి తంతు మొదలవుతుంది. ఈ వివాహ వేడుకలో అందరి దృష్టి వధూవరులపై కాదు. కానీ నిజానికి అక్కడ వధూవరులుండరు. వారు కూర్చునే కుర్చీలపై తెల్లటి వస్త్రాలు కప్పి ఉంచుతారు. దాని చుట్టూ తిరుగుతూ వధూవరులు వేయాల్సిన ఏడడుగులను ఆ ఇంటి వాళ్లే వేసేస్తారు. తాళి, ఆశీస్సులు తదితర పెళ్లి కార్యక్రమాలు ఇక మామూలే. కేవలం కుటుంబ సభ్యులే కాదు స్థానికులు, బంధువులు, సన్నిహితులు కూడా ఈ వేడుకకు హాజరవుతారు. ఇంతకీ ఈ పెళ్లి ఎవరికనేగా మీ అనుమానం. ఎప్పుడో పురిట్లో చచ్చిపోయిన వరుడికి. అలాగే ప్రసవం సందర్భంగా పుట్టగానే చనిపోయిన అమ్మాయిని వెతికి మరీ పెళ్లి చేస్తారు. ఈ ప్రేతాత్మల పెళ్లిళ్లలో ఏడు తరాల సాంప్రదాయాల్ని చూడడం మాత్రం మరిచిపోరు. కులం, గోత్రం, వరుసలు అన్నీ సరిగ్గా కుదిరాకే పెళ్లికి రెడీ చేస్తారు. కాకపోతే అసలు మనుషులు ఉండరు. ఇప్పుడు జరుగుతోన్న ప్రేతాత్మల వయస్సు 30 ఏళ్లు. అంటే మూడు దశాబ్దాల క్రితం చనిపోయిన వారికి ఇప్పుడు పెళ్లిళ్లు చేస్తున్నారన్నమాట. ఇక వధూవరుల ప్రెసెన్స్ తప్ప విందులు, వినోదాలూ అన్నీ షరా మామూలే.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens