Director Raghavendra Rao is one of those who has earned a special place for himself in the history of Telugu cinema. He directed many wonderful films and raised the level of Telugu cinema at the national level. He left an indelible mark in the industry with four Nandi Awards and 5 Filmfare Awards. Besides, Raghavendra Rao has the credit of introducing many aspiring actors to the industry. The director who introduced many people to the silver screen in his nearly 48-year career is now introducing a new generation.
As part of this, a YouTube channel named KRR Works was launched. Opportunities will be provided to newcomers through this channel. The shooting of many short movies has already started. This YouTube channel has been brought to provide opportunities to newcomers in all the crafts in the film industry. Meanwhile, megastar Chiranjeevi launched this YouTube channel.
Telugu version
తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వారిలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒకరు. ఎన్నో అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయిలో చాటారు. నాలుగు నంది అవార్డులు, 5 ఫిలిమ్ ఫేర్ అవార్డులతో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. అంతేకాకుండా ఇండస్ట్రీకి ఎంతో మంది ఔత్సాహిక నటీనటులను పరిచయం చేసిన ఘనత రాఘవేంద్రరావు సొంతం. దాదాపు 48 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎంతో మందిని వెండి తెరకు పరిచయం చేసిన దర్శకేంద్రుడి ఇప్పుడు కొత్త తరాన్ని పరిచయం చేస్తున్నారు.
మెగాస్టార్‌కు, రాఘవేంద్రరావుకు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి ఎన్నో బ్లాక్ బ్లస్టర్ హిట్స్‌ను అందించారు. ఈ నేపథ్యంలో తాజాగా భోళా శంకర్ సెట్‌ని కూడా రాఘవేంద్ర రావు సందర్శించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కేఆర్‌ఆర్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్‌ను లాంచ్ చేసిన మెగాస్టార్ రాఘవేంద్రరావుకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇండస్ట్రీలోకి కొత్త వారికి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నా్ని చిరు ఆహ్వానించారు.