CPI Narayana Says Sorry To Megastar Chiranjeevi

Finally CPI Narayana backs down. Megastar apologized to Chirnajeevi. He made it clear that he is regretting his comments.. and taking them back. He said that he considered the word used as a language error.. He suggested that there is no dispute. He said that Chiranjeevi is a political leader. Mega fans were asked to forget these comments. Chiranjeevi fans and members of Kapu Nadu should come together to help the flood victims. Recently, Narayana used some harsh words to target Chiranjeevi and Pawan Kalyan. At the unveiling of the statue of Alluri Seetharamaraju, attended by Prime Minister Modi, Krishna, who played the role of Alluri Seetharamaraju, was not called, but Chiru was called. Chiranjeevi, who changes colors in politics, does not deserve a place on the stage. They also said that Pawan is  like a land mine.. no one knows when it will explode.

But when Narayana targeted Chiru, the anger of mega fans broke. He received many warnings on social media. Kapu Sanghas also strongly objected to Narayana's comments. The matter went to police complaints. Mega Brother Nagababu also responded. He made his mark comments that he should teach Narayana to eat grass and eat rice. Many experts have expressed their opinion that Narayana has crossed the line. Narayana said that he is taking back his comments.

Telugu Version

ఎట్టకేలకు సీపీఐ నారాయణ వెనక్కి తగ్గారు. మెగాస్టార్ చిరంజీవికి సారీ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని.. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తాను వాడిన పదాన్ని భాషా దోషంగా పరిగణిస్తున్నానని.. వివాదం వద్దని సూచించారు. చిరంజీవి రాజకీయ నేతగా ఉన్నారని..రాజకీయాల్లో విమర్శలను స్పోర్టివ్గా తీసుకోవాలని పేర్కొన్నారు. మెగా అభిమానులు ఈ వ్యాఖ్యల్ని మర్చిపోవాలని కోరారు. చిరంజీవి ఫ్యాన్స్, కాపు నాడు సభ్యులు కలిసి వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఇటీవల చిరంజీవి, పవన్ కళ్యాణ్ టార్గెట్గా కాస్త ఘాటు పదజాలం ఉపయోగించారు నారాయణ. ప్రధాని మోదీ హాజరైన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదిక పైకి.. అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను పిలవకుండా.. చిరును పిలవడాన్ని తప్ప పట్టారు. రాజకీయాల్లో రంగులు మార్చే చిరంజీవికి స్టేజ్పై ప్లేస్ తగదని.. చిల్లర బేరగాడు అంటూ కామెంట్స్ పేల్చారు. అలాగే పవన్ ఒక ల్యాండ్ మైన్ లాంటివాడని.. అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు.

కాగా నారాయణ చిరును టార్గెట్ చేయడంతో.. మెగా ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆయనకు పలు వార్నింగ్స్ వచ్చాయి. కాపు సంఘాలు కూడా నారాయణ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పోలీస్ కంప్లైంట్స్ వరకు వెళ్లింది వ్యవహారం. మెగా బ్రదర్ నాగబాబు కూడా రెస్పాండ్ అయ్యారు. నారాయణకు గడ్డి తినడం మాన్పించి.. అన్నం తినడం నేర్పాలని తన మార్క్ కామెంట్స్ చేశారు. నారయణ లైన్ క్రాస్ చేశారని పలువురు నిపుణులు నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో వెనక్కి తగ్గి.. తన  కామెంట్స్ వెనక్కితీసుకుంటున్నట్లు చెప్పారు నారాయణ.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens