వెయ్యి ఏళ్ల చరిత్ర గలిగిన... తెలంగాణ రాష్ట్రంలోని, నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండలంలోని ఆవంచ గ్రామంలో కొలువైన చాళుక్యుల కాలం నాటి ఏకశిల గణపతికి(ఐశ్యర్య గణపతి) శాశ్వత ఆలయం కట్టిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే.. 10ఏళ్ల ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా ఓ సభలో మర్రి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. మాజీ మంత్రి, ఆవంచ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డితో కలిసి కేసిఆర్ తో మాట్లాడినట్లు ప్రకటించారు. కొన్ని రోజుల్లో నిధుల విడుదల అవుతాయని తెలియజేశాడు.
మీ అందరికీ మా ధన్యవాదాలు:
గణపతి చతుర్థి సందర్భంగా... ఆవంచ గణపతిపై మనవాయిస్ మీడియాలో ఓ కథనం వేశాం. అది బాగా వైరల్ అయింది. స్థానిక ప్రాంతం నాగర్ కర్నూల్ జిల్లాలో వైరల్ అయింది. మా చీఫ్ ఎడిటర్ మేరే శంకర్, స్థానికుల సహాయంతో చేసిన... ఈ కథనంపై మీ స్పందన అమూల్యం. ఇప్పటి వరకు మేము కాలగర్భంలో కలిసిపోతున్న అనేక చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, కోటలు, మరెన్నో వాటిని ప్రతి శనివారం మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈరోజు మా కష్టానికి ప్రతిఫలం లభించింది. మాకు చాలా ఆనందం కలిగింది ఈ వార్త విన్నాక. మీ అభిమానాలు/స్పందన ఇలాగే ఉండాలని కోరుకుంటూ... మరిన్ని చారిత్రక కట్టడాలు మీ ముందుకు తీసుకువస్తాం.
అలాగే ఆవంచ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇట్లు
మనవాయిస్ గ్లోబల్ మీడియా
చీఫ్ ఎడిటర్
మేరే శంకర్.