It is known that Andhra Pradesh State Skill Development Corporation (APSSDC) organizes job fairs frequently to fill vacancies in leading private companies. Job fairs are organized in many places of the state and job opportunities are provided to the unemployed. In this order, they have prepared to organize another job fair. Full details about the Job Mela to be held in Visakhapatnam on July 18.
Vacancies to be filled & Qualifications
- A total of 1000 vacancies will be filled in the Yokohama organization as part of the job fair.
- These include 500 vacancies in IAT (Industrial Apprentice Trainee) and 500 vacancies in WAT (Women Apprentice Trainee).
- Candidates who have passed ITI (Fitter, Electrician, Instrument, Diesel Mechanic) are eligible for IAT posts.
- Candidates who have completed three years diploma can apply for the posts of Women Apprentice Trainee. Those who have done mechanical, electrical, electrical and telecommunication, auto mobile engineering can apply for these vacancies.
Important things
* Interested and eligible candidates have to register first through this link.
https://apssdc.in/industryplacements/
- Registered candidates will have to attend the job fair on 18th of this month at 10 am.
- Candidates will be selected through HR round.
- Selected candidates will have to work at Achyutapuram, Vizag address.
- Resume, xeroxes of study certificates, Aadhaar, bank pass book should be brought along while attending the job fair.
- Interviews will be held at APSSDC District Office, Kancherla Palem, Visakhapatnam 530007.
- Contact number 7989158111 for complete details.
Telugu Version
ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తరుచూ జాబ్ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు చోట్ల జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జూలై 18న విశాఖపట్నంలో జరగనున్న జాబ్‌మేళాకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు
- జాబ్‌మేళాలో భాగంగా యోకోహమా సంస్థలో మొత్తం 1000 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- వీటిలో IAT (ఇండస్ట్రియల్ అప్రంటీస్ ట్రైనీ) విభాగంలో 500 ఖాళీలు, WAT (ఉమెన్ అప్రంటీస్ ట్రైనీ) 500 ఖాళీలు ఉన్నాయి.
- ఐఏటీ పోస్టులకు ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్, డీజిల్ మెకానిక్) చేసిన అభ్యర్థులు అర్హులు.
- ఉమెన్ అప్రంటీస్ ట్రైనీ పోస్టులకు మూడేళ్ల డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన విషయాలు
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థు లు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. https://apssdc.in/industryplacements/
- రిజిసర్ట్ చేసుకున్న అభ్యర్థులు ఈ ఈనెల 18న ఉదయం 10 గంటలకు జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులను హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు అచ్యుతాపురం, వైజాగ్ చిరునామాలో పని చేయాల్సి ఉంటుంది.
- జాబ్‌మేళాకు హాజరయ్యే సమయంలో రెజ్యూమ్, స్టడీ సర్టిఫికేట్స్ జిరాక్స్‌లు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూలను ఏపీఎస్‌ఎస్‌డీసీ డిస్ట్రిక్ట్ ఆఫీస్, కంచెర్ల పాలెం, విశాఖపట్నం 530007 అడ్రస్‌లో నిర్వహిస్తారు.
- పూర్తి వివరాల కోసం 7989158111 నంబర్‌ను సంప్రదించాలి.