చిన్నప్పటి నుండి చదువుతో పాటు Extra Curricular Activities ఎక్కువ ఇంటరెస్ట్ ఉండటంతో 10th అవ్వగానే Holidays లో Typewriting నేర్చుకుని English Higher Exam కంప్లీట్ చేశాను. Inter Holidays లో Tailoring నేర్చుకున్నా.. నా డ్రస్సెస్ అండ్ Blouses నేనే కుట్టుకుంటా. తరువాత మా తమ్ముడు Screen Printing చేసేవాడు. నేను కూడా Computer Course DTP, DCA నేర్చుకకని Wedding Cards, Visiting Cards Designing చేసి ఇచ్చేదాన్ని. Typing వచ్చు కాబట్టి.. నాకు Training ఇచ్చిన Institute వాళ్లే Job offer ఇచ్చారు. Data entry and DTP operator గా 7 years work చేస్తూ BA, MA distance Education ద్వారా కంప్లీట్ చేశాను. తరువాత పెళ్ళి.. ఒక అబ్బాయి.. మా Husband Maths Lecturer. తన career కోసం B.Ed చేస్తుంటే... నేను రికార్డ్స్ వ్రాసి ఇచ్చేదాన్ని. సో మళ్లీ నాకు B.Ed చేయాలనిపించి... డిస్టెన్స్ లో B.Ed కంప్లీట్ చేశా... ప్రైవేట్ స్కూల్ లో తెలుగు టీచర్ గా వర్క్ చేస్తూ మరో PG [MA (తెలుగు)] కంప్లీట్ చేశాను. ఇప్పుడు కొత్తగా Crochet నేర్చుకుంటున్నాను.
ఇక Hobbies గురించి చెప్పాలంటే మెయిన్ డ్రాయింగ్. ఎక్కడా నేర్చుకోలేదు కానీ. నచ్చిన డ్రాయింగ్ ని బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. అలాగే కొంచెం creative గా DIY చేయడం, Wall paintings, Dress and Saree Painting, కుట్లు, అల్లికలు, Rangoli, Nail and Thread Works ఇలా రకరకాల Art works చేయడం అలవాటు.
అలాగే రకరకాల వంటలు చేయడం.. అందులో కూడా కొంచెం Creative గా ఆలోచించి జిలేబీలతో అక్షరాలు, జంతికలతో సంక్రాంతి ముగ్గులు, బొమ్మల దోశలు, కూరగాయలతో బొమ్మలు చేయడం ఇలా నాదైన స్టైల్ లో కొంచెం Creativity Add చేసి చేయడం నాకిష్టం. అలా Art of Bhanu పేరుతో ఒక YouTube చానెల్ కూడా ప్రారంభించడం జరిగింది.
Covid Time లో Social Media ప్రభావం తో కొన్ని Facebook Groups లో చేరి నా ఆర్ట్ works ని పంచుకునేదాన్ని. అలా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన తోనే Recent గా crochet వర్క్ నేర్చుకొని Guinness World Record కూడా గెలుచుకున్నాను. అది నా మాటల్లో చెప్పలేని ఆనందం. అలాగే నా Creativity ని మెచ్చుకొని Telugu Mom's Network వారు Women's Day Virtual Awards లో Best Creativity Award ఇచ్చారు.