Alert for devotees of Tirumala Srivari. Tirumala Tirupati Devasthanam (TTD) has made several changes regarding Divyadarshan tickets. So far it is known that the devotees of Srivari are given divine darshan tokens at Gali Gopuram. However, these tickets will be issued from Friday (April 14) at Alipiri Bhudevi Complex. Devotees who have received the tokens have to scan at the center near the Galigopuram on the Alipiri footpath.
Even if any of the devotees who have got tickets do not get scanned.. even if they reach Tirumala by other means.. they will not be allowed to see Swami under any circumstances. And according to tradition, Divyadarshanam tokens will be handed over on the Srivari Mettu route. That means these tickets will be provided to the devotees at the 1240th step. The Time Slot Sarvadarshanam Tokens (SSD) center, which was issued till now at Alipiri Bhudevi Complex, has been moved to the Vishnu Nivasam Yatrikul accommodation complex opposite the railway station.
TTD said that SSD tokens are being issued in Tirupati itself for those who want to go to Tirumala in their own vehicles. The time slot Sarvadarshanam tokens will be distributed at Srinivasam opposite RTC bus stand, Vishnu Nivasam near Tirupati Railway Station and Govinda Raja Satra. Devotees are requested to observe these changes and cooperate with TTD. On the other hand, due to the summer season, the number of devotees in Tirumala is gradually increasing.
With this, TTD has taken a decision to reduce the VIP break, Srivani, tourism quota, virtual services and Rs.300 darshan tickets, putting a big burden on the common devotees. Also, in the streets of the temple, chaluvapandilas, chaluvasunnam and carpets have been arranged to provide relief to the devotees from the heat of the sun.
Telugu version
తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. దివ్యదర్శనం టికెట్లకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు మార్పులు చేసింది. ఇప్పటివరకు శ్రీవారి భక్తులకు గాలి గోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం (ఏప్రిల్14) నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టికెట్లను జారీ చేయనున్నారు. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం దగ్గర ఉన్న కేంద్రంలో స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
టికెట్లు పొందిన భక్తులు ఎవరైనా ఒకవేళ స్కాన్ చేసుకోకపోయినా.. ఇతర మార్గాల్లో తిరుమల చేరుకున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారి దర్శనానికి అనుమతించరు. ఇక యథా ప్రకారంగానే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శనం టోకెన్లను అందజేయనున్నారు. అంటే 1240వ మెట్టు వద్ద భక్తులకు ఈ టికెట్లను అందించనున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఇప్పటివరకు జారీ చేస్తున్న టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్ల (ఎస్‌ఎస్‌డీ) కేంద్రాన్ని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం యాత్రికుల వసతి సముదాయానికి తరలించారు.
ఇక సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్లాలనుకునేవారికి, తిరుపతిలోనే ఎస్‌ఎస్‌డీ టోకెన్లను జారీ చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఆర్‌టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం, తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం, గోవింద రాజ సత్రాల్లో టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లను పంపిణీ చేయనున్నారు. భక్తులు ఈ మార్పులు గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు. మరోవైపు వేసవి సీజన్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. దీంతో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ వీఐపీ బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300 దర్శన టికెట్లను తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాట్లు చేశారు.