English Version
It is known that the central government has brought a new Agnipath Scheme for the youth to join the three forces and participate in the service of the country. As a part of this, applications are being accepted from the already eligible candidates in Airforce and Navy. A large number of youth are registering for army jobs across the country. Meanwhile, Agnipath Recruitment Rally will be organized in AP as well. Candidates from 13 districts of AP and youth from Yanam can participate in this recruitment held at Visakhapatnam venue. The defense department said that the selection of fire fighters will be held at the Indira Priyadarshini Stadium in Visakhapatnam from August 14 to 31.
Candidates from Vizianagaram, Srikakulalam, East Godavari, Visakhapatnam, Konaseema, West Godavari, Parvathipuram Manyam, Alluri district, Anacapalli, NTR, Kakinada districts of AP can participate in this recruitment rally. The officials of the Defense Department have advised the eligible and interested candidates to register online by the 30th of this month. He said that the admit cards will be released to the registered candidates from August 7. If you have any doubts regarding registration or other matters, please contact 0891-2756959, 0891-2754680. Apart from this, candidates have the opportunity to clear their doubts through the Army Calling mobile app.
Telugu Version
త్రివిధ దళాల్లో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ స్కీమ్ (Agnipath Scheme) ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎయిర్‌ఫోర్స్, నేవీల్లో ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత ఆర్మీ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో కూడా అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (Agnipath Recruitment Rally) నిర్వహించనున్నారు. విశాఖపట్నం వేదికగా నిర్వహించే ఈ రిక్రూట్‌మెంట్‌లో ఏపీలోని 13 జిల్లాల అభ్యర్థులతో పాటు యానాంకు చెందిన యువత పాల్గొనవచ్చు. ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్నివీరుల సెలెక్షన్‌ను నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.
ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళలం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నెల 30వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రక్షణ శాఖ అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 7 నుంచి అడ్మిట్ కార్డులను విడుదల చేస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇతర అంశాలకు సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలుంటే.. 0891-2756959, 0891-2754680 నంబర్లను సంప్రదించాలని సూచించారు. దీంతో పాటు ఆర్మీ కాలింగ్ మొబైల్ యాప్ ద్వారా అభ్యర్థులు తమ సందేహాలను తీర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.