Kalyan Ram's movie.. Iconic romantic song.

Kalyan Ram, who recently got a super hit with the movie Bimbisara, is now coming up with another interesting movie. Kalyan Ram's tripathribhinayam movie 'Amigos'.

 
Nandamuri Kalyan Ram has earned a special identity for himself by acting in different films and distinctive roles. Kalyan Ram, who recently got a super hit with the movie Bimbisara, is now coming up with another interesting movie. Kalyan Ram's tripathribhinayam movie 'Amigos'. Naveen Erneni and Y. Ravi Shankar are producing this film under the banner of Mythri Movie Makers, a famous production company under the direction of Rajendra Reddy. The movie is going to be released on February 10 worldwide. The promotional activities of the movie are going on in full swing. The already released 'Amigos' movie teaser and song got superb response.


The film unit released the second song from the film on Tuesday. This is a remix song of the Ever Green Melody Song 'Enno Ratruloozaingani..' from the movie Dharma Kshetram starring Nandamuri Balakrishna. S.P.Balasubramaniam sang the song of Dharma Kshetra many nights. Coincidentally, now the remix song of the same song has also been sung by his brother S. P. B. Charan. Sameera Bharadwaj has sung this classic song along with S. P. B. Charan. This trance tune by Ilaya Raja takes us to another world.

This video song beautifully elevates the beautiful romance between Kalyan Ram and Aashika Ranganath. The lyrics and visuals are a treat for the audience's eyes, along with the beautiful tune. Sandalwood beauty Ashika Ranganath looks more beautiful in this melody music.. Kalyan Ram impressed with his stylish look. There is no doubt that this remix song will find a place in the best songs playlist. Music composed by Gibran, the film is releasing worldwide on February 10.

Telugu version


ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీత్ రాబోతున్నారు.కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్డి.


ఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు  సంపాదించుకున్నారు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీత్ రాబోతున్నారు.కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’.  రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ కానుంది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి

.
మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ధ‌ర్మ క్షేత్రం సినిమాలో ఎవ‌ర్ గ్రీన్ మెలోడి సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ సాంగ్‌కి ఇది రీమిక్స్ సాంగ్‌. ధ‌ర్మ క్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. పాట‌ను  ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం పాడారు. యాదృచ్చికంగా ఇప్పుడు అదే పాట‌కు రీమిక్స్ సాంగ్‌ను కూడా ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.బి.చ‌ర‌ణ్ ఆల‌పించారు. ఈ క్లాసిక్ సాంగ్‌ను ఎస్‌.పి.బి.చ‌ర‌ణ్‌తో పాటు స‌మీర భ‌ర‌ద్వాజ్ ఆల‌పించారు. ఇళ‌య రాజా అందించిన ఈ ట్రాన్సింగ్ ట్యూన్ మ‌న‌ల్ని మ‌రో ప్ర‌పంచ‌లోకి తీసుకెళుతుంది.

ఈ వీడియో సాంగ్‌ క‌ళ్యాణ్ రామ్‌, ఆషికా రంగ‌నాథ్ మ‌ధ్య సాగే బ్యూటీఫుల్ రొమాన్స్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేస్తుంది. చ‌క్క‌టి ట్యూన్‌కి త‌గ్గ సాహిత్యం,  విజువ‌ల్స్ ఆడియెన్స్ క‌ళ్ల‌కు ట్రీట్‌లాగా ఉంది. శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగ‌నాథ్ ఈ మెలోడి మ్యూజిక్‌లో మ‌రింత అందంగా క‌నిపిస్తుంటే.. క‌ళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌తో ఆక‌ట్టుకున్నారు. బెస్ట్ సాంగ్స్ ప్లే లిస్ట్‌లో ఈ రీమిక్స్ సాంగ్ స్థానం ద‌క్కించుకుంటుంద‌న‌టంలో సందేహం లేదు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు.
 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets