Bhadrachalam temple is gearing up for Sri Ram Navami celebrations. As part of this order, Sri Ramanavami Kalyana Brahmotsavam will be organized from 22nd of this month to 5th April in Ramulavari temple, temple officials said. Sitaram's Kalyanam will be performed on March 30 at the Mithila Mandapam near the temple. Officials are making arrangements to enable devotees to watch this ceremony. Temple EO Ramadevi stated that the tickets related to this will be made available online from yesterday i.e. from February 1.
As a result these tickets can be booked on the website www.bhdrachalamaonline.com . Tickets of Rs.7,500, Rs.2,500, Rs.2000, Rs.1000, Rs.300 and Rs.150 will be available. However, the officials said that both will be given entry on the ticket of seven thousand five hundred. Only one person can enter on other tickets. With a total of 16,860 people in the mandapam and 15,000 people from the stadium, there is a chance to watch Prega Ramulori's performance live. Sri Rama Samajrya Patabhishekam will be held on 31st of this month. Three types of tickets will be sold in this regard.
Telugu Version
భద్రాచలం ఆలయం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో భాగంగానే రాములవారి ఆలయంలో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మార్చి 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో సీతారాముల కల్యాణం జరపనున్నారు. ఈవేడుకను భక్తులు వీక్షించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన టికెట్లును నిన్నటి నుంచి అంటే ఫిబ్రవరి 1 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి పేర్కొన్నారు.
ఫలితంగా ఈ టికెట్లను www.bhdrachalamaonline.comవెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. రూ.7,500, రూ.2,500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. అయితే ఏడువేల ఐదువందల టికెట్ పై ఇద్దరికీ ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా టికెట్లపై ఒకరి మాత్రమే ప్రవేశించే వీలుంది. టోటల్ గా 16,860 మంది టెకట్లతో మండపంలోనూ, 15వేల మంది స్టేడియం నుంచి ప్రీగా రాములోరి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఈనెల 31న శ్రీరామ సామాజ్ర్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మూడు రకాల టికెట్లను విక్రయించనున్నారు.