There may be many blockbuster movies and industry hits in Power Star Pawan Kalyan's movie career, but the first love movie has a special place. This movie, which is an evergreen cult classic in love stories, will never be abandoned even if it is shown on TV. First love movie PawanThere is no doubt that it has given a big boost to the film career.
At the same time, Kirti Reddy, who acted as the heroine, brought an unprecedented craze. Her beauty and acting in this film left the boys of both the states in awe. Especially her entry scene in the movie will be remembered forever. Vadde acted in the movie Love with Naveen. After that Nagarjuna played Cupid again in Raoi Chandamama. And then in Arjun's movie she appeared as Mahesh Babu's sister. She went to Bollywood while doing films in Telugu. She also made two or three films there. But could not get so much success.
After that, she re-entered Tollywood and married hero Akkineni Sumanth. But their relationship did not last long. Sumanth and Keerthy Reddy separated within a year of their marriage due to quarrels in their married life. But after the divorce, Keerthy Reddy got married to an NRI for the second time. After his second marriage, he moved to America and settled there. They both have two children. She is staying away from movies and is currently busy with her children. He is not very active on social media either. But in the meantime, she appeared in a movie function and created a buzz.
Telugu version
పవర్ స్టార్ పవన్ కల్యాన్ సినిమా కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు, ఇండస్ట్రీ హిట్లు ఉండచ్చు గాక .. కానీ తొలి ప్రేమ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రేమకథా చిత్రాల్లో ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచే ఈ సినిమాను ఇప్పటికీ టీవీల్లో వస్తే అసలు విడిచిపెట్టరు. తొలిప్రేమ సినిమా పవన్ సినిమా కెరీర్‌కు పెద్ద బూస్ట్ నిచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి రెడ్డికి కీడా ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చింది.
ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి రెండు రాష్ట్రాల్లోని కుర్రకారు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా సినిమాలోని ఆమె ఎంట్రీ సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలిప్రేమ సినిమా వడ్డే నవీన్‌తో కలిసి ప్రేమించే సినిమాలో నటించింది. ఆ తర్వాత రావోయి చందమామలో నాగార్జున మరదలిగా మన్మథుడిని ఆట పట్టించింది. ఆపై అర్జున్ మూవీలో మహేష్ బాబు సోదరిగా మెప్పించింది. తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ కూడా రెండు మూడు సినిమాలు తీసింది. అయితే అంతగా విజయాలు దక్కించుకోలేకపోయింది.
ఆతర్వాత మళ్లీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి హీరో అక్కినేని సుమంత్ ను పెళ్లి చేసుకుంది. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. దాంపత్య జీవితంలో గొడవలు రావడంతో పెళ్లి చేసుకున్న ఏడాదికే సుమంత్, కీర్తి రెడ్డి విడిపోయారు. అయితే విడాకుల తర్వాత ఒక ఎన్‌ఆర్‌ఐను రెండో వివాహం చేసుకుంది కీర్తి రెడ్డి. రెండో వివాహం తర్వాత అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె ప్రస్తుతం పిల్లల ఆలనాపాలనలోనే బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. అయితే ఆ మధ్యన ఒక సినిమా ఫంక్షన్‌లో కనిపించి సందడి చేసింది.