Renu has revealed the top secrets about her illness that only her closest friends know about. Her post on Insta saying that she has been suffering from a heart related disease for years... She is not getting the strength to face it now... has gone viral. If someone is suffering like me, the purpose of this post is to fill them with courage and positive energy, said Renudesai. Do not lose heart under any circumstances. Stand strong… this world has many surprises planned for us. The inspirational words written by her saying let's wait for them with a smile are moving the netizens.
Whether taking treatment… using medicines… doing yoga. Taking good nutrition. Get well soon and participate in the shooting... Renu Desai said without mentioning his illness and its severity. If we look at the diagnostic equipment on her back... we can understand the health condition of Renu. Currently, Renu is running with a Holter monitor. Safety Holter monitor… Under what conditions do doctors refer it… started inquiring deeply. A Holter monitor is a device that measures the rhythm of the heart. This device, which is placed on the chest for 24 hours, can continuously record the heartbeat. Even if the heart rhythm is lost or the beating speed is reduced, it is easily known in this.
Telugu version
అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలిసిన తన అనారోగ్యం గురించిన టాప్ సీక్రెట్స్ బైటపెట్టుకున్నారు రేణు. కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా… దాన్ని ఫేస్ చెయ్యడానిక్కావల్సిన శక్తిని ఇప్పుడిప్పుడే కూడదీసుకుంటున్నా… అంటూ ఇన్‌స్టాలో ఆమె చేసిన పోస్ట్… వైరల్‌గా మారింది. నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపడమే ఈ పోస్ట్ ఉద్దేశ్యం అంటూ చెప్పుకొచ్చారు రేణుదేశాయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు. బలంగా నిలబడండి… ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేసింది. నవ్వుతూ వాటి కోసం ఎదురుచూద్దాం అంటూ ఆమె రాసుకున్న ఇన్‌స్పిరేటివ్ వర్డ్స్… నెటిజన్లను కదిలించేస్తున్నాయి.
ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా… మందులు వాడుతున్నా… యోగా చేస్తున్నా. మంచి పోషకాహారాన్ని తీసుకుంటున్నా. త్వరలోనే కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటా… అంటూ రేణూ దేశాయ్ తన రుగ్మతను, దాని తీవ్రతను చెప్పకనే చెప్పేశారు. ఆమె ఒంటిమీదున్న డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్‌ని గమనిస్తే… రేణు ఎటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హోల్టర్ మానిటర్ అనే పరికరంతో నడుస్తున్నారు రేణు. అసలేమిటీ హోల్టర్ మానిటర్… ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు దీన్ని రిఫర్ చేస్తారు… అని లోతుగా ఆరా తియ్యడం మొదలైంది. గుండె గుట్టును రట్టు చేసే పరికరం పేరే హోల్టర్ మానిటర్. ఛాతీ మీద 24 గంటల పాటు అమర్చే ఈ పరికరం ద్వారా గుండె కొట్టుకునే విధానాన్ని నిరంతరాయంగా రికార్డ్ చెయ్యొచ్చు. గుండె లయ తప్పినా, కొట్టుకునే వేగం తగ్గినా ఇందులో ఈజీగా తెలిసిపోతుంది.