The world is now forgetting about the corona epidemic. Corona cases have decreased slightly across the world. But at this time, the emergence of another virus epidemic is becoming alarming. The emergence of dangerous 'Marburg' virus cases in Ghana in West Africa is worrying. It is in this context that the World Health Organization has become alert. In view of the recent spread of Marburg virus in Equatorial Guinea, WHO has taken a key decision.
The World Health Organization (WHO) has called an emergency meeting to discuss the outbreak of an Ebola-like virus in Central Africa. According to a report in BNO, the Ebola-like virus has killed nine people in Equatorial Guinea. There is no vaccine available for this virus so far. Lockdown has also been imposed in virus affected areas.
Meanwhile, the World Health Organization has already warned that this virus is deadly. This virus has the ability to spread very quickly. But it is not airborne. The World Health Organization has said that the Marburg virus is spread by touching infected people, through blood and other body fluids, and by sharing the bedding and clothes of patients. The World Health Organization has warned that the virus can also be transmitted to humans from infected animals and bats.
Telugu version
ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారిని మరిచిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇలాంటి సమయంలో మరో వైరస్ మహమ్మారి కేసులు బయటపడటం ఆందోళనకరంగా మారుతోంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రమాదకరమైన ‘మార్ బర్గ్’ వైరస్ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ అయ్యింది. తాజాగా ఈక్వటోరియల్ గినియాలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా డబ్ల్యూహెచ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
మధ్య ఆఫ్రికాలో ఎబోలా లాంటి వైరస్ వ్యాప్తి గురించి చర్చించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. BNOలోని ఒక నివేదిక ప్రకారం, ఎబోలా లాంటి వైరస్ ఈక్వటోరియల్ గినియాలో ఈ వైరస్ కారణంగా తొమ్మిది మంది మరణించారు. ఈ వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సైతం విధించారు.
ఇదిలా ఉంటే ఈ వైరస్ ప్రాణాంతకమని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్ కు చాలా వేగంగా విస్తరించే సామర్థ్యం ఉందని తెలిపింది. అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదు. వైరస్ సోకిన వారిని తాకడం వల్ల, రక్తం, ఇతర శరీర ద్రవాల ద్వారా, రోగుల పడక, వస్త్రాలను ఇతరులు వినియోగించడం ద్వారా మార్ బర్గ్ వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.వైరస్ సోకిన జంతువులు, గబ్బిలాల నుంచి కూడా ఈ వైరస్ మనుషులకు సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.