Education Minister Sabitha Indra Reddy on Tuesday released the dates of M.C.E.T and other entrance exams for the academic year 2023-24 for admission to various professional courses in Telangana.
As part of this, the schedule of all 07 entrance exams has been released. The Telangana MSET 2023 exams to be conducted by JNTU will be conducted from May 7 to 11 for the MSET Engineering section exam.
MSET Agri and Pharma section will be held from May 12 to 14. Apart from these, TS EDSET will be held on May 18, TS ECET on May 20, TS LASET on May 25, TS ISET on May 26, 27 and TS PGESET on May 29, 30, 31 and June 1.
Minister Sabitha Indra Reddy has released the dates for all types of entrance exams. Vakati Karuna, Education Secretary, Professor R. Limbadri, Chairman, Telangana State Board of Higher Education Prof.
V. Conducted a review meeting with Venkata Ramana, Vice-Chairman and other officials. The minister suggested that all the officers should work together to conduct the examinations smoothly.
Telugu version
తెలంగాణలో వివిధ ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశం కోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎమ్‌సెట్‌తో పాటు మరికొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇందులో భాగంగా మొత్తం 07 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
జేఎన్టీయూ నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్ 2023 పరీక్షలను ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్ష మే 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.
ఎంసెట్ అగ్రీ అండ్ ఫార్మా విభాగం మే 12 నుంచి 14 వరకు నిర్వహిస్తారు. వీటితో పాటు టీఎస్ ఎడ్‌సెట్ మే 18, టీఎస్ ఈసీఈటీ మే 20వ తేదీ, టీఎస్ లాసెట్ మే 25వ తేదీన, టీఎస్ ఐసెట్ మే 26,27 తేదీల్లో, టీఎస్ పీజీఈసెట్‌ను మే 29, 30, 31, జూన్ 1 నిర్వహించనున్నట్లు అధికారులు పలికారు.
అన్ని రకాల ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి తన కార్యాలయంలో వాకాటి కరుణ, విద్యాశాఖ కార్యదర్శి, ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రొ. వి. వెంకట రమణ, వైస్-ఛైర్మన్‌తో పాటు ఇతర అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షలను సుజువుగా నిర్వహించేందుకు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సూచించారు.