లావణ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మస్తాన్ సాయి తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించారు. మస్తాన్ సాయి తనను బ్లాక్ మెయిల్ చేశాడని, మరికొన్ని యువతులను కూడా చెరబట్టాడని తెలిపారు. ఆయనతో కలిసి పార్టీల్లో పాల్గొన్నప్పుడు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని, హార్డ్ డిస్క్ లో తన వీడియోలను చూసినట్టు తెలిపారు. మస్తాన్ సాయి అసలు స్వరూపాన్ని బయటపెట్టడమే తన లక్ష్యమని చెప్పారు.
రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని లావణ్య చెప్పారు. ఆమెకు మస్తాన్ సాయి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బయటకు వెళ్లాలన్నా భయపడుతున్నానని చెప్పారు. అన్ని వివాదాలకు ముగింపు పలికి, న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఆమె తెలిపారు.