విద్యార్థులకు శుభవార్త: సర్టిఫికెట్లు పోయినా టెన్షన్ అవసరం లేదు
ఉన్నత విద్య విద్యార్థులందరికీ కేంద్ర విద్యాశాఖ కొత్తగా 12 అంకెల ‘అపార్ ఐడీ’ అందించనుంది. ఈ ఐడీతో విద్యార్థుల అన్ని అకడమిక్ వివరాలు ఒకే చోట స్టోర్ అవుతాయి. సర్టిఫికెట్లు పోయినా, గనుక ఈ ఐడీ ఉంటే అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. వచ్చే జూన్ నాటికి అన్ని విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇప్పటికే 75 శాతం అపార్ ఐడీలను క్రియేట్ చేసింది. సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు నిపుణుల సహాయం తీసుకుని విద్యార్థులకు అపార్ ఐడీ జారీ చేస్తున్నారు. జాతీయ స్థాయి సమీక్షలో డిప్యూటీ సెక్రటరీ రోహిత్ త్రిపాటి ఈ యూనివర్సిటీని అభినందించారు. ఈ ఐడీని 100% పూర్తిచేసి విద్యార్థులకు మరింత సౌలభ్యంగా సేవలు అందించాలని సూచించారు.