IPL 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఈ పరాజయాలకు కారణం జట్టు బౌలింగ్ బలహీనతే అని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్లు లేకపోవడం వల్లే జట్టు నష్టాల్లో పడుతోందని చెప్పారు.
గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో SRH జట్టు కేవలం 152 పరుగులకే పరిమితమైంది. అనంతరం బౌలింగ్‌లో కూడా మంచి ప్రదర్శన చూపలేకపోయారు. గుజరాత్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, రూథర్‌ఫోర్డ్ బాగా ఆడడంతో SRH ఓడిపోయింది. రాయుడు మాట్లాడుతూ, SRH బౌలర్లు పరుగులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, వికెట్లు తీయడం లేదు అని విమర్శించారు.
ఇలాంటి వ్యూహంతో విజయాలు సాధించలేమని రాయుడు చెప్పాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల బౌలర్లను గుర్తించి, జట్టులోకి తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. గుజరాత్ తరఫున సాయి కిషోర్, రషీద్ ఖాన్ వంటి బౌలర్లు ఆ సమయంలో మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారని గుర్తు చేశారు.