ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో చెన్నై ఓ దారుణ పరాభవాన్ని చవిచూసింది.
సొంత గడ్డపై తక్కువ స్కోరుకు ఆడిన ధోనీ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై బ్యాటింగ్ విఫలమవడంతో కేవలం 103 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా, కేవలం రెండు వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని సగం ఓవర్లలోనే సాధించింది.
ఇప్పటి వరకూ ఆడిన 6 మ్యాచ్‌లలో చెన్నైకి ఇది వరుసగా ఐదవ ఓటమి, ఇది ఐపీఎల్ చరిత్రలో మొదటి సారి ఒక జట్టు వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిన సందర్భం కావడం గమనార్హం.
అంతేకాదు, చెన్నైలోని మ్యాచ్‌లలో ఇది చెన్నై జట్టు నమోదు చేసిన అత్యల్ప స్కోరు కావడం మరో విషాదకరమైన విషయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై కింది నుండి రెండో స్థానంలో నిలిచింది.
చెన్నై జట్టు ఈ దుస్థితి నుంచి ఎలా బయటపడుతుందన్నది అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జట్టు ఫామ్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది.