chnology

సత్య నాదెళ్ల: యూట్యూబర్ అభ్యర్థనకు కేవలం నాలుగు నిమిషాల్లో ఓకే చెప్పిన మైక్రోసాఫ్ట్ సీఈవో

క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్‌తో సంచలనం సృష్టించిన సత్య నాదెళ్ల

బిల్ గేట్స్ మానస పుత్రిక అయిన మైక్రోసాఫ్ట్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. సత్య నాదెళ్ల సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, మైక్రోసాఫ్ట్ కేవలం ఏఐ పరిధిని దాటి, క్వాంటమ్ కంప్యూటింగ్‌లో కొత్త మైలురాయిని నమోదు చేసింది. ‘గాడ్ చిప్’ అనే విప్లవాత్మక టెక్నాలజీని సత్య నాదెళ్ల ఆవిష్కరించడం టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఓ పాడ్‌కాస్ట్ కోసం చకచకా తీసుకున్న నిర్ణయం

క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ ప్రకటించిన తరువాత, సత్య నాదెళ్ల భారత సంతతికి చెందిన యూట్యూబర్ ద్వారకేశ్ పటేల్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాడ్‌కాస్ట్ ఆహ్వానాన్ని స్వీకరించేందుకు సత్య నాదెళ్ల ఎక్కువగా ఆలోచించలేదు. యూట్యూబర్ పంపిన ఒక సాధారణ ఈమెయిల్‌కు వెంటనే స్పందించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

కేవలం నాలుగు నిమిషాల్లోనే సమాధానం

ద్వారకేశ్ పటేల్ తన యూట్యూబ్ చానెల్లో మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వంటి ప్రముఖులతో పాడ్‌కాస్ట్‌లు నిర్వహించారు. సత్య నాదెళ్ల తన న్యూస్‌లెటర్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకున్నట్లు గుర్తించిన పటేల్, వెంటనే ఒక సాధారణ ఈమెయిల్ ద్వారా పాడ్‌కాస్ట్‌కు ఆహ్వానించారు. అయితే ఆశ్చర్యకరంగా నాదెళ్ల కేవలం నాలుగు నిమిషాల్లోనే బదులిచ్చారు. "నీ పాడ్‌కాస్ట్‌లు అద్భుతంగా ఉన్నాయి" అంటూ సత్య నాదెళ్ల ప్రశంసిస్తూ, తాను పాల్గొంటానని తెలిపారు. ఈ విషయం యూట్యూబర్ పటేల్ ఎక్స్ (Twitter) ద్వారా పంచుకోగానే వైరల్ అయింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens