పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ, అజిత్‌కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ మరియు తమిళ నటుడు అజిత్ కుమార్ పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ గొప్ప గౌరవాన్ని పురస్కరించుకుని, సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరికి శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారని, ఆయనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉందని ప్రశంసించారు. కళాసేవతో పాటు ప్రజాసేవలో కూడా మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలంటూ ఆకాంక్షించారు.
అలాగే తమిళ నటుడు అజిత్ కుమార్ గురించి మాట్లాడుతూ, ప్రేమకథలు, కుటుంబ నేపథ్య చిత్రాలతో పాటు వైవిధ్యభరితమైన పాత్రలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని అన్నారు. తనదైన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడని, రేసర్‌గా కూడా విజయవంతంగా కొనసాగుతున్నాడని కొనియాడారు. అజిత్ మరిన్ని విజయాలు సాధించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.