The mad desire to become a millionaire in a short time and the greed to earn money on loan are the investment for them. Cybercriminals are using technology for wrongdoing. No matter how many cyber frauds are emerging in the society, still such cases are coming to light. Recently, a similar incident came to light in Sangardedi. A software employee fell prey to cyber criminals and eventually lost his life. This terrible incident took place on Wednesday.
If we go into the details... Arvind (30), a young man from Sangareddy, is working as a software employee. Along with this, he chose work from home through a link in Telegram. Based on the tasks given therein Rs. 200 if you invest Rs. 250 were sent by cybercriminals. Arvind became greedy after receiving money. In this order, Rs. 12 lakhs invested online.
But after that there was no response from the cyber criminals. Even after completing all the tasks, not a single rupee was given. Due to this, he incurred huge debts. Finally, Arvind's sister's wedding was on the 5th of the next month, so he also used the hidden money for household expenses. Arvind went into a situation where he could not do anything. He committed suicide by hanging himself on Wednesday afternoon when no one was at home due to debts on the one hand and money for his sister's wedding on the other hand.
Telugu version
తక్కువ సమయంలో లక్షాదికారి కావాలనే పిచ్చి కోరిక, అప్పనంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశ ఇవే వారికి పెట్టుబడి. టెక్నాలజీని తప్పుడు పనులకు ఉపయోగిస్తూ సైబర్ నేరగాళ్లు నిండా ముంచేస్తున్నారు. సమాజాంలో ఎన్ని సైబర్ మోసాలు బయటపడుతున్నా ఇప్పటికీ ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన సంగార్డెడిలో వెలుగులో చూసింది. సైబర్ నేరగాళ్ల మాయ మాటలో పడిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన బుధవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన అరవింద్ (30) అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. దీంతో పాటు టెలిగ్రామ్‌లో వచ్చిన ఓ లింక్ ద్వారా వర్క్ ఫ్రo హోం ఎంచుకున్నాడు. అందులో ఇచ్చిన టాస్క్‌ల ఆధారంగా రూ. 200 ఇన్వెస్ట్ చేస్తే రూ. 250లను సైబర్ నేరస్థులు పంపించారు. డబ్బులు రావడంతో అరవింద్‌కు అత్యశ పుట్టింది. ఈ క్రమంలోనే ఏకంగా రూ. 12 లక్షల వరకు ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టారు.
అయితే ఆ తర్వాత సైబర్ నేరస్తుల నుంచి రెస్పాన్స్ రాలేదు. టాస్క్‌లన్నీ పూర్తి చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో భారీగా అప్పులు చేశాడు. చివరికి వచ్చే నెల 5వ తేదీన అరవింద్ చెల్లె పెళ్లి ఉండడంతో ఇంట్లో ఖర్చులకు దాచిన డబ్బులను సైతం వాడుకున్నాడు. ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు అరవింద్. ఓవైపు పేరుకు పోయిన అప్పులు, మరోవైపు చెల్లి పెళ్లికి డబ్బు అందకపోవడంతో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.