నటీఆర్ ట్రస్ట్ విస్తరణ: విజయవాడలో కొత్త భవనం త్వరలో ప్రారంభం
విజయవాడలో నటీఆర్ ట్రస్ట్ భవన్ కొత్తగా ప్రారంభంకానుంది. త్వరలోనే భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నటీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మార్చి 6న భూమి పూజ నిర్వహించనున్నారు.
ఇందుకోసం నేషనల్ హైవే 16, సాయిబాబా టెంపుల్ రోడ్ జంక్షన్, LEPL మాల్ పక్కన 600 గజాల స్థలం కొనుగోలు చేశారు. ఈ G+5 ఆధునిక భవనం ట్రస్ట్ కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు నూతన సదుపాయాలతో నిర్మించనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని కార్యాలయం నుండి ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ భవనం పూర్తయ్యాక, ప్రధాన కార్యకలాపాలు అక్కడికి మార్చనున్నారు. హైదరాబాద్ నుంచి కొంతమంది సిబ్బందిని విజయవాడకు బదిలీ చేయనున్నారు. అదనంగా స్థానికంగా కొత్త సిబ్బందిని నియమించనున్నారు.