tics International

Abortion Pills Kills a Family Women

Their family is happily going on like a wife and husband with three children. After some time the wife got pregnant again. The husband who should have been happy behaved harshly. He did not want children and forced her to have an abortion. Without stopping, he took abortion pills. As a result, the victim became seriously ill and died while undergoing treatment at the hospital. Geeta Yadav, who hails from Naubasta near Kanpur in Uttar Pradesh, got married to Vipin Yadav six years ago. They have two daughters and one son. In this process she got pregnant again. The husband, who did not like this, suggested an abortion. For that he gave abortion pills to Geetha. Soon after wearing it, Geeta fell ill. Bleeding profusely. The observed family members rushed her to a nursing home in Naubasta for treatment. He was taken to a hospital for better treatment. She died while receiving treatment there.

The family members of the deceased who came to know about the matter took up agitation. They demanded action against the husband and his family members. Amid tensions, the police seized the body and sent it for postmortem. The police have registered a case on this incident. A case has been filed under various sections of the IPC. The police said that the actual cause of the woman's death will be revealed in the postmortem report. A warning was given that if it is proved that abortion medicine was forcibly given to the woman, she will be severely punished as per the law.

Telugu Version

భార్య, భర్త ముగ్గురు పిల్లలు ఇలా వారి కుటుంబం సంతోషంగా సాగిపోతోంది. కొంత కాలానికి భార్య మరోసారి గర్భం దాల్చింది. ఆనందపడాల్సిన భర్త కర్కశంగా ప్రవర్తించాడు. పిల్లలు వద్దని, అబార్షన్ చేసుకోవాలని బలవంతం చేశాడు. అంతటితో ఆగకుండా అబార్షన్ పిల్స్ తాగించాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉత్తర ప్రదేశ్  లోని కాన్పూర్ సమీపంలో ఉన్న నౌబస్తా ప్రాంతానికి చెందిన గీతా యాదవ్ కు విపిన్ యాదవ్తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మరోసారి గర్భం దాల్చింది. దీనిని ఇష్టం లేని భర్త.. అబార్షన్ చేయించుకోవాలని సూచించాడు. అందుకోసం గీత కు అబార్షన్ పిల్స్ ఇచ్చాడు. అది వేసుకున్న కొద్దిసేపటికి గీత అస్వస్థతకు గురైరంది. తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం నౌబస్తాలోని నర్సింగ్హోమ్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. భర్త, అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతల మధ్యే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో మహిళ మృతికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. మహిళకు బలవంతంగా అబార్షన్ మెడిసిన్ ఇచ్చారని నిరూపిస్తే చట్టం ప్రకారం కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens