ucation_Jobs

Inter board's key decision in the matter of exams valuation.

Telangana has taken a decision canceling the tender called for Intermediate Online Valuation. Only one company came forward to do the valuation. Due to the lack of bids, the Inter Board decided to cancel the tender called. Looking to call for tenders again. It is known that Globarena has faced many criticisms in the evaluation of examination papers in the past. He expressed doubt that this time the same company will change its name and bid. But Globarina has clarified that no such efforts have been made.

Meanwhile, it is known that there have been allegations in the past that many students got wrong marks due to the mistakes made by the Globerena organization. In this context, Dr. P Madhusudan Reddy recently expressed his joy over the cancellation of the tenders issued by the Inter Vidya Mandali for online valuation.

 The chairman of Inter Vidya JAC said that even now the state government should make fundamental changes in relation to these tenders and implement online valuation in a phased manner with experienced organizations. Also, it was suggested to the Inter Board to train the teachers about online evaluation and implement the experimental method from the evaluation of Advanced Supplementary Examinations papers to be held in the month of May.

Telugu version

తెలంగాణ ఇంటర్మీడియేట్‌ ఆన్‌లైన్ వాల్యుయేషన్‌కి పిలిచిన టెండర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాల్యూయేషన్ చేసేందుకు ఒకే ఒక్క కంపెనీ ముందుకొచ్చింది.

 దీంతో బిడ్లు రాకపోవడంతో పిలిచిన టెండర్ రద్దు చేస్తూ ఇంటర్‌ బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది. మళ్లీ టెండర్లు పిలవాలని చూస్తున్నారు. గతంలో పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో గ్లోబరేనా సంస్థ అనేక విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈసారి అదే కంపెనీ పేరు మార్చి బిడ్ వేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే గ్లోబరీనా సంస్థ మాత్రం అలాంటి ప్రయత్నాలు చెయ్యలేదని క్లారిటీ ఇచ్చేసింది.

ఇదిలా ఉంటే గ్లోబరేనా సంస్థ చేసిన తప్పిదాలు వల్లే ఎంతో మంది విద్యార్థులకు మార్కులు తప్పులతడకగా పడినట్టు గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్ విద్యా మండలి ఆన్‌లైన్‌ వాల్యూయేషన్ కోసం జారీ చేసిన టెండర్స్‌ను రద్దు చేయడంపై తాజాగా డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

 ఇక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్లకి సంబంధించి మౌలికమైన మార్పులు చేసి అనుభవం ఉన్న సంస్థలతో ఆన్‌లైన్‌ వాల్యుయేషన్‌ని దశలవారీగా అమలు చేయాలని ఇంటర్ విద్య జేఏసి చైర్మన్ అన్నారు. అలాగే ఆన్‌లైన్‌ వాల్యుయేషన్ పట్ల అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి, ప్రయోగాత్మక పద్ధతిని మే నెలలో జరగబోయే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పేపర్స్ వ్యాల్యుయేషన్ నుంచి అమలు చేయాలని ఇంటర్ బోర్డుకు సూచించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens