Technology

New Options & Features in WhatsApp

English Version

WhatsApp is always at the forefront of bringing new features to meet the changing needs. It is adding features according to the convenience of users, so no matter how many types of messaging apps are coming, the WhatsApp craze is not decreasing. In this order, WhatsApp is bringing a new option. Usually when WhatsApp is opened it shows others that you are online.

But with the latest feature that will be brought by WhatsApp, the option of hiding people online even if they are not known will be brought. An option will be brought to enable users to hide their online status. But there will be an option to set who wants to see this online status. This feature is currently being tested. Later this feature will be made available to everyone.

It seems that this option will be provided in the soon to be released WhatsApp update. Meanwhile, it is known that WhatsApp is preparing to increase the delete every one time. WhatsApp is gearing up to increase the time it takes to delete a message sent to the other person from the current 2 hours to two days. This option will also be made available in a few days.

Telugu Version

మారుతోన్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు తీసుకురావడంలో వాట్సాప్‌ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. యూజర్ల వెసులుబాటుకు అనుగుణంగా ఫీచర్లను జోడిస్తోంది కాబట్టే ఎన్ని రకాల మెసేజింగ్ యాప్స్‌ వస్తున్నా వాట్సాప్‌ క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్‌ సరికొత్త ఆప్షన్‌ను తీసుకొస్తోంది. సాధారణంగా వాట్సాప్‌ ఓపెన్‌ చేసినప్పుడు అవతలి వారికి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు చూపిస్తుంది.

అయితే తాజాగా వాట్సాప్‌ తీసుకురానున్న ఫీచర్‌తో ఆన్‌లైన్‌లో ఉన్నా తెలియకుండా హైడ్‌ చేసుకునే ఆప్షన్‌ను తీసుకురానున్నారు. యూజర్లు ఆన్‌లైన్‌ స్టేటస్‌ను హైడ్‌ చేసుకోవడానికి వీలుగా ఆప్షన్‌ తీసుకురానున్నారు. అయితే ఈ ఆన్‌లైన్‌ స్టేటస్‌ ఎవరికి కనిపించాలనుకునే దానిని కూడా సెట్‌ చేసుకునే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. అనంతరం ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

త్వరలో విడుదల చేయనున్న వాట్సాప్‌ అప్‌డేట్‌లో ఈ ఆప్షన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా వాట్సాప్‌ డిలీట్‌ ఎవరీ వన్‌ సమయాన్ని కూడా పెంచేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అవతలి వ్యక్తికి పంపిన మెసేజ్‌ను డిలీట్‌ చేయడానికి ప్రస్తుతం ఉన్న 2 గంటల సమయాన్ని రెండు రోజులకు పెంచేందుకు వాట్సాప్‌ సన్నాహాలు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens