YS Sharmila who laid hands on the police Angry khakis Video

YS Sharmi, President of YSRTP, who was ready to take initiation near Hyderabad's Indira Park on unemployment issues, was arrested by the police. As Sharmila was going to Indira Park, the police stopped her near her house. Stopped near lotuspond. On this occasion, Sharmila got into an argument with the police.

 He expressed his anger as to why he was being stopped. Protesting against the behavior of the police, they staged a sit-in on the road and protested. With this, she was finally arrested and taken to Jubilee Hills Police Station.

But during the arrest process, Sharmila laid hands on the police who were on standby. The police took the incident of attack seriously and registered a case against Sharmila. A case has been registered against her under various sections.

YS Vijayamma reached Jubilee Hills Police Station after Sharmila's arrest. When Vijayamma came to visit Sharmee, she was not allowed inside.

Telugu Version

నిరుద్యోగ సమస్యలపై హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర దీక్షకు సిద్ధమైన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. షర్మిల ఇందిరా పార్క్ దగ్గరకు వెళ్తుండగా.. ఆమెను ఇంటిదగ్గరే అడ్డుకున్నారు పోలీసులు. లోటస్‌పాండ్‌ దగ్గరే నిలువరించారు. ఈ సందర్భంగా పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి నిరనస తెలిపారు. దీంతో.. చివరికి ఆమెను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అయితే అరెస్ట్ క్రమంలో బందోబస్తులో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నారు షర్మిల. దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు.

షర్మిల అరెస్ట్ అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. షర్మిలను పరామర్శించేందుకు విజయమ్మ రాగా.. ఆమెను లోపలికి అనుమతించలేదు.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens