ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శరీరాకృతి, ఫిట్‌నెస్‌పై పలు వ్యాఖ్యలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం, యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
యోగరాజ్ సింగ్ తాజాగా 'ఫైండ్ ఏ వే' అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో, టీమిండియాకు కోచ్‌గా పనిచేసే అవకాశం వస్తే ఆయన ఏమి చేస్తారో అనే ప్రశ్నకు బదులుగా, "విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లను కాపాడుకుంటూ వారికి అండగా ఉంటాను" అని ఆయన తెలిపారు.
జాతీయ జట్టుకు కోచ్‌గా అవకాశం వస్తే, ఉన్న ఆటగాళ్లతోనే జట్టును తిరుగులేని శక్తిగా మార్చి, వారికి ప్రోత్సాహం అందిస్తానని యోగరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. "కోహ్లీ, రోహిత్ వంటి విలువైన ఆటగాళ్లను కాపాడుకోవాలి" అని ఆయన స్పష్టం చేశారు. ఆరు రంజీ ట్రోఫీని గెలవడానికి, టెస్టులలో మంచి ప్రదర్శన చేయడానికి వారి కోసం ప్రత్యేక శిక్షణను ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు వెల్లడించారు. "వారికి పూర్తి మద్దతు ఇస్తానని" ఆయన చెప్పారు.
"ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు, కానీ కష్టకాలంలో వారికి అండగా ఉండాలి" అని యోగరాజ్ సింగ్ పేర్కొన్నారు. అవసరమైతే, "రోహిత్‌ను 20 కిలోమీటర్లు పరిగెత్తిస్తానని, కానీ వారిని వదిలిపెట్టడం లేదు" అని స్పష్టం చేశారు.