Vizag RK Beach Married Woman Missing Mystery

An unexpected development took place in the missing case of Sai Priya, a married woman who went missing from Visakhapatnam's RK Beach. The authorities who have been searching for her for 36 hours have come to know the shocking facts. Sai Priya appeared in Nellore when everyone thought she was lost in the sea. Sai Priya was found in Nellore by her relatives. He was found to have run away with his lover. Before marrying Srinivas, Sai Priya was reportedly in love with a man named Ravi from Nellore. It seems that Sai Priya went with Ravi twice before marriage. Srinivas got married on July 25, 2020 under the pressure of family members.

As Srinivas was working in a pharma company in Hyderabad, the couple settled in Hyderabad. But even after the marriage, Sai Pallavi continued her love affair with Ravi. Four months ago, Sai Priya came to Visakhapatnam from Hyderabad to do a computer course. At the same time Srinivas came to Visakha from Hyderabad on 25th of this month which was his second marriage day. Sai Priya, who went to the beach with her husband at 5.30 pm on the same day, conveyed the information to her boyfriend Ravi before that. Sai Priya ran away from the place along with Ravi when Srinivas was unconscious. Not knowing this, Srinivas was deeply worried that his wife was missing. After filing a complaint with the police, they jointly launched a search operation with helicopters.

Telugu Version

విశాఖపట్నం ఆర్కే బీచ్లో తప్పి పోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపడుతోన్న అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. సముద్రంలో గల్లంతైందని అందరూ భావిస్తుండగా సాయి ప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు ఆమె బంధువులు గుర్తించారు. ప్రేమిడికుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. శ్రీనివాస్తో వివాహానికి కంటే ముందు.. సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు రెండు సార్లు రవితో కలిసి సాయి ప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది.

శ్రీనివాస్ హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్ డే అని శ్రీనివాస్ ఈ నెల 25న హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens