Visakha kidney mafia incident Nagababu criticizes the state government

Jana Sena Party General Secretary Nagababu demanded that the masterminds of the Visakha kidney mafia should be pulled out. The masterminds of this kidney mafia should be immediately arrested and investigated. He said that the Visakha kidney mafia is using unemployed youth and poor families who do not have minimum means of livelihood in the state. He accused the people of being forced by the careless attitude of the YCP government.

 He said that the situation is understood because the system has been brought to a state where body parts are stolen by hoping to buy a two-wheeler. He said that the victims of the kidney racket, which has been carried out without a hitch for a long time, are coming out one by one. It is known that the victims' kidneys are being destroyed before they know what is going on, targeting the areas where ordinary and poor families live, regardless of age or gender.

Nagababu said that it is the responsibility of the government to conduct medical examinations in areas where ordinary and poor families live and find out how many more victims there are. He said that in the past, the kidney mafia had done business with body organs in Visakha. He expressed his concern that the educated youth of the state are treading on obstacles due to the inability of the government to provide proper job opportunities. Nagababu said that the government has the responsibility to eliminate the kidney mafia in Visakhapatnam.

Telugu version

విశాఖ కిడ్నీ మాఫియా ప్రధాన సూత్రధారులను బయటకు లాగాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు డిమాండ్ చేశారు. ఈ కిడ్నీ మాఫియాలో ప్రధాన సూత్రధారులు ఎవరున్నా సరే తక్షణమే అరెస్ట్ చేసి, విచారణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో కనీస జీవనాధారం లేని నిరుద్యోగ యువతను, నిరుపేద కుటుంబాలను విశాఖ కిడ్నీ మాఫియా పావులుగా వాడుకుంటోందన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ప్రజలు బలవుతున్నారని ఆరోపించారు.

 ద్విచక్ర వాహనం కొనిస్తామని ఆశ చూపి శరీర అవయవాలు దోచుకునే స్థితికి వ్యవస్థను తీసుకొచ్చారు అంటేనే పరిస్థితి అర్థం అవుతోందన్నారు. ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా నడిపించిన కిడ్నీ రాకెట్ బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారని.. ఇంకెంతమంది బాధితులు ఉంటారో అనే ఆందోళన రోజు రోజుకూ పెరిగిపోతోందన్నారు. సాధారణ, పేద కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకొని పెద్దా చిన్న, ఆడ మగ తేడా లేకుండా అసలేం జరుగుతోందో తెలుసుకునే లోపే బాధితుల కిడ్నీలు మాయం చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు.

సాధారణ, పేద కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు అనే సంగతి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నాగబాబు అన్నారు. గతంలో కూడా విశాఖలో కిడ్నీ మాఫియా శరీర అవయవాలతో వ్యాపారం చేశారని.. ప్రభుత్వ నిర్లక్ష్యం మోసగాళ్ళకు అలవాటుగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో విద్యావంతులైన యువతకు ప్రభుత్వం సరైన ఉద్యోగ అవకాశాలు అందించలేని కారణంగా అడ్డదారులు తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ మహానగరంలో కిడ్నీ మాఫియాను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వంకు ఉందని నాగబాబు అన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens