మనం రోజూ ఉదయం సామాన్యంగా ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటి టిఫిన్స్ చేస్తుంటాం.... ఇలానే ఎంతో సులువుగా అయిపోయే టిఫిన్, తినేకొద్ది తినాలనిపించే టమోటో రైస్ ఈ రోజు మనం చూద్దాం ...ఇది కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో పూర్తి ఐపోతుంది. చాలా టేస్టీగా ఉండే టమోటో రైస్ చిటికెలో ఎలా చేసేయొచ్చో చూసేద్దాం.
కావలసిన పదార్థాలు :-
ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
బిర్యాని ఆకు - ఒకటి
దాల్చిన చెక్క- కొంచెం
లవంగాలు - 2
యాలకలు -1
కరివేపాకు - 2 రెబ్బలు
ఉల్లిపాయలు - 2 చిన్నవి
మిరపకాయలు - 5
పసుపు - 1/2 టీ స్పూను
అల్లం పేస్ట్ - 1 టీ స్పూను
టమోటోలు - 3 చిన్నవి
కారం - 1 టేబుల్ స్పూను
గరం మసాలా - 1/2 టీ స్పూను
ఉప్పు - రుచికి తగినంత
అన్నం - 2 కప్పులు
తయారీ విధానం :-
ముందుగా కళాయిలో నూనె పోసి వేడి చెయ్యాలి. నూనె వేడయ్యాక బిర్యాని ఆకు, దాల్చిన చెక్క , యాలకులు, లవంగాలు, కరివేపాకు వేసి వేయించాలి. ముక్కలుగా కోసిన ఉల్లిపాయలు , మిరపకాయలు, అల్లం పేస్ట్, పసుపు వేసి వేయించాలి. చిన్న ముక్కలుగా కోసుకున్న టమోటోలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. గరంమసాలా, కారం, ఉప్పు వేయాలి. ఇప్పుడు అన్నం వేసి బాగా కలపాలి. అంతే వేడి వేడి టమోటో రైస్ రెడీ.