When the Kanna route was cleared, the ruling party was also alerted. YSP ministers have prepared counters to nip Kanna's aggression in the bud. The unbreakable bond between Chandrababu and Kanna is not what it used to be today. In the flashback, Kanna and Chandrababu Jigri are friends. YCP is reminding the past that they joined BJP as a covert of TDP and that's why Kamalam resigned from the party president's post. But.. another version of the minister is that both of them are arch enemies.
As Minister Amarnath said.. If Chandrababu had planned to murder or not.. They had fought against Babu in a range in the past. There have been many instances where Chandrababu has been ripped apart, saying that EVMs were manipulated, Agrigold victims were wronged, Polavaram project was turned into a tourist place, Amit Shah himself was going to be killed in Tirupati. But.. the principle that there is no permanent enmity in politics is not applicable to Kanna too..
Telugu version
కన్నా రూట్ క్లియరయ్యీ కాగానే రూలింగ్ పార్టీ కూడా అలర్టయింది. కన్నా దూకుడుని మొగ్గదశలోనే తెగ్గొట్టాలన్న కసితో.. కౌంటర్లు సిద్ధం చేసుకున్నారు వైసీపీ మంత్రులు. చంద్రబాబుకీ, కన్నాకు మధ్య విడదీయరాని బంధం ఈనాటిది కాదట. ఫ్లాష్‌బ్యాక్‌లో కన్నా అండ్ చంద్రబాబు జిగ్రీ దోస్తులట. టీడీపీ కోవర్టుగానే బీజేపీలో చేరారని, అందుకే కమలం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఊడబీకేశారని గతాన్ని గుర్తు చేస్తోంది వైసీపీ. కానీ.. వాళ్లిద్దరూ ఆగర్భ శత్రువులనేది మరో మంత్రి వెర్షన్.
మంత్రి అమర్‌నాథ్ చెప్పినట్టు.. చంద్రబాబు కన్నా మర్డర్‌కు ప్లాన్ చేశారా లేదా అనేది అలా ఉంచితే.. గతంలో బాబు మీద ఓ రేంజ్‌లో ఫైటింగ్ చేశారు కన్నా. ఈవీఎంలను మానిప్యులేట్ చేశారని, అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేశారని, పోలవరం ప్రాజెక్టును టూరిస్టు ప్లేస్‌గా మార్చేశారని, తిరుపతిలో అమిత్‌షానే చంపించబోయారని… ఇలా చంద్రబాబును కన్నా చీల్చి చెండాడిన సందర్భాలు అనేకానేకం. కానీ.. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదన్న నీతిసూత్రం కన్నాక్కూడా వర్తించదా ఏంటి..