Many people came into limelight through popular comedy show Jabardasth. They are in the top position with their talent. Some of them are also appearing on the silver screen. Famous comedian Kirrak RP is also one of those who made his entry with Zabardast and got good recognition. The talented actor made the television audience laugh out loud with Chalaki Chandra.
Later, Kirrak became the team leader under the name of RP. But when Nagababu left the show, RP also said goodbye to Jabardast. Later he went to other channels and impressed. But then Nellore Peddareddy ventured into his own business called fish soup.
First is KukatpallyThis food center, which was launched in Customers had to be controlled with bouncers. Traffic problems also arose. This branch was closed within a few days.
But with more enthusiasm, Nellore Peddareddy re-opened the fish soup shop within a week. Recently, Kirrak RP has made sensational comments that some people are promoting his 'Nellore Peddareddy fish soup' that the taste is not good. He is saying that some paid batch who are not related to him have conspired against him and that is why they are doing this malicious campaign.
Telugu version
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. తమ ట్యాలెంట్‌తో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. అందులో కొందరు వెండితెరపై కూడా సత్తాచాటుకుంటున్నారు. అలా జబర్దస్త్‌తో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రముఖ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ కూడా ఒకరు. చలాకీ చంద్రతో కలిసి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఆతర్వాత కిర్రాక్ ఆర్పీ పేరుతోనే టీం లీడర్‌గా ఎదిగాడు. అయితే ఎప్పుడైతే నాగబాబు షో నుంచి వెళ్లిపోయారో ఆర్పీ కూడా జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
ఆతర్వాత వేరే ఛానల్స్ లో వెళ్లి ఆకట్టుకున్నాడు. అయితే ఆపై నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ సొంతంగా బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. మొదట కూకట్‌పల్లిలో ప్రారంభించిన ఈ ఫుడ్ సెంటర్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. బౌన్సర్లతో కస్టమర్లను కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్ సమస్యలూ తలెత్తాయి. దీంతో కొద్ది రోజుల్లోనే ఈ బ్రాంచ్ మూత పడింది.
అయితే మరిన్ని హంగులతో తిరిగి వారంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాపును రీ ఓపెన్ చేశాడు. కాగా ఈ మధ్యన తన ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ రుచి అసలు బాలేదని కొంతమంది పనికట్టుకొని లేని పోని ప్రచారం చేస్తున్నారని కిర్రాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనంటే పడని కొందరు పెయిడ్ బ్యాచ్ తనపై కుట్ర పన్నారని, అందుకే ఈ విష ప్రచారానికి పాల్పడుతున్నారన్నాడు.