The torrential rain that flooded Hyderabad Many areas were flooded

Bhagyanagara was flooded by Varuna. It rained heavily from early morning. People faced many difficulties due to heavy rains in Hyderabad. All the streets of the city flowed like rivers due to the rain that fell for more than three hours. Those who came out for work in the early morning had to face severe difficulties due to the rain. Water has entered the houses in the low lying areas.. On the other hand there is also the problem of traffic jam due to rain.

Due to heavy rain, water has entered the houses in many parts of the city. Banjara Hills. Ameerpet, Panjagutta, Kukatpally. A similar situation was seen in the old town of Secunderabad, Mehdipatnam, Dilsukhnagar, LBnagar, Vanasthalipuram and Malkajigiri.

GHMC's negligence has taken its toll. A 9-year-old girl was swallowed by Nala in Kalasiguda, Secunderabad as the authorities were not prepared to deal with the situation despite continuous rains for a few days. The Meteorological Department has alerted people in the wake of forecast of heavy rain for another two to three hours. The Meteorological Department has said that there will be heavy rains in Telangana for two more days.

Weather department has forecast rain in Telugu states today and tomorrow. The surface circulation will continue from Vidarbha..with this effect it has indicated that moderate rains will occur in many places in Telangana..4 days of rains with thunder in AP..there is a possibility of moderate rains in Coast and Rayalaseema..it has advised farmers to take appropriate measures in agricultural work..and people should be alert.

Telugu version

భాగ్యనగరాన్ని వరుణుడు ముంచెత్తాడు.పొద్దున్న నుంచి కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.  మూడు గంటలకు పైగాగా పడిన వర్షంతో నగర వీధులన్నీ నదుల్లా ప్రవహించాయి. పొద్దున్నే పనుల కోసం బయటకు వచ్చిన వారు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది..మరోవైపు వర్షంతో ట్రాఫిక్ జామ్ సమస్య కూడా నెలకొంటుంది.

భారీ వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. బంజారాహిల్స్‌. అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి. సికింద్రాబాద్‌, మెహదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, మల్కాజిగిరిలతో ఆటు పాతబస్తీలో ఇదే పరిస్థితి కనిపించింది.

జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం నిండు ప్రాణాలను తీసుకుంది. కొద్ది రోజులుగా వరుసగా వానలు పడుతున్నా పరిస్థితిని ఎదుర్కోడానికి అధికార యంత్రాంగం సిద్ధం కాకపోవడంతో సికింద్రాబాద్ కళాసిగూడలో 9 ఏళ్ల బాలికను నాలా మింగేసింది. మరో రెండు, మూడు గంటల పాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసింది వాతవరణ శాఖ.తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం విదర్భ నుంచి కొనసాగుతుంది..ఈ ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడతాయని సూచించింది..ఇక ఏపీలో 4రోజులు పిడుగులతో కూడిన వర్షాలు..కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది..రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది..అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens