The news is like a festival for the farmers

It must be said that this is a really comforting news for cotton farmers. Till now, the farmers who were suffering due to untimely rains and falling prices are now getting some relief. Cotton prices in Kurnool district have gone up hugely. Adoni cotton market, which is the main center of about seven districts, has seen a huge increase in the demand for cotton. As a result, cotton prices increased.

 A quintal of cotton will cost a maximum of Rs. 8,169 is pronounced. With the end of the season, reduced supply and increased demand, cotton prices have increased due to competition between traders. Farmers are happy with the increase in the price of cotton.

However, the country's cotton yield fell sharply this season, leading to increased international demand and a rise in cotton prices. Kurnool Adoni market reaches record highs.

 As there is a good demand for cotton in the international market, traders have come forward to buy cotton at a higher price. Currently Rs. Market sources say that it is more than 8,000. Cotton prices are at record levels even during the season. At one stage the price of cotton per quintal was Rs. 10 thousand crossed.

Telugu version

పత్తి రైతులకు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త అనే చెప్పాలి. మొన్నటి వరకు అకాల వర్షాలతో, పడిపోయిన ధరలతో కుదేలైన రైతులకు.. ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయిన పరిస్థితులు. కర్నూలు జిల్లాలో పత్తి ధరలు భారీగా పెరిగాయి. దాదాపు ఏడు జిల్లాలకు ప్రధాన కేంద్రమైన ఆదోని పత్తి మార్కెట్‌లో పత్తికి డిమాండ్ భారీగా పెరిగింది. దాంతో పత్తి ధరలు పెరిగాయి. క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ. 8,169 పలుకుతోంది. సీజన్ ముగియడంతోపాటు సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం వల్ల వ్యాపారుల మధ్య పోటీతో పత్తి ధరలు పెరిగాయి. పత్తి ధర పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ సీజన్‌లో దేశంలో పత్తి దిగుబడి బాగా తగ్గడంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడి పత్తి ధరలు పెరిగాయి. కర్నూలు ఆదోని మార్కెట్‌లో రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి మంచి డిమాండ్‌ ఉండడంతో వ్యాపారులు పత్తిని అధిక ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం రూ. 8 వేలకు పైగా పలుకుతుండగా.. వ్యాపారుల మధ్య పోటీతో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ వర్గాలు. ఇక సీజన్ టైమ్‌లో కూడా పత్తి ధరలు రికార్డ్ లెవల్‌లో పలికాయి. ఒకానొక దశలో క్వింటాల్ పత్తి ధర రూ. 10 వేలు దాటింది.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens