The meeting of Telangana BJP leaders ended with Amit Shah and Nadda.. What topics were discussed?

A meeting of Telangana BJP leaders was held with Nadda and Amit Shah. The meeting lasted for about three and a half hours in Delhi. The Telangana BJP leaders who went to Hastina on the urgent call to come met Amit Shah at JP Nadda's house. Speaking to the media after the meeting, BJP leaders Ponguleti Sudhakar said that public issues will be discussed in the meeting. He criticized that people would throw sticks at the KCR government. Talking about the liquor scam, he said that the law is doing its job.

Bandi Sanjay, Laxman, DK Arun, Etala Rajender, Vijayashanti, Komatireddy Rajagopal Reddy, Vivek, Jitender Reddy, Ponguleti, Arvind Sudhakar and some other leaders participated in this meeting which lasted for three and a half hours. Amit Shah and Nadda gave direction in these meetings. Mission 90 and election plans were mainly discussed. It seems that Amit Shah has suggested that steps should be taken to take the lotus symbol to every house.

Meanwhile, BJP is sharpening its strategies to come to power in Telangana. After Karnataka, Telangana is expected to take a foothold. In this order, BRS is attacking the government whenever it gets time.

Telugu version

నడ్డా, అమిత్‌షాలతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఢిల్లీలో దాదాపు మూడున్నర గంటల పాటు ఈ భేటీ సాగింది. అత్యవసరంగా రావాలంటూ వచ్చిన పిలుపుతో హస్తినకు వెళ్లిన తెలంగాణ బీజేపీ నాయకులు.. జేపీ నడ్డా ఇంట్లో అమిత్‌షాతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్‌ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించామనన్నారు. ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెడతారని విమర్శించారు. లిక్కర్‌ స్కామ్‌ గురించి మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పుకొచ్చారు.

మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. బండి సంజయ్‌, లక్ష్మణ్‌, డీకే అరుణ్‌, ఈటల రాజేందర్‌, విజయశాంతి, కొమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌, జితేందర్‌ రెడ్డి, పొంగులేటి, అరవింద్‌ సుధాకర్‌తో పాటు మరికొందరు నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో అమిత్‌షా, నడ్డా దిశా నిర్దేశం చేశారు. మిషన్‌ 90, ఎన్నికల ప్రణాళికలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కమలం గుర్తును ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలా చర్యలు చేపట్టాలని అమిత్‌షా హితబోధ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ. కర్ణాటక తర్వాత తెలంగాణలో పాగా వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై సమయం దొరికినప్పుడల్లా అటాక్‌ చేస్తోంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens