A road accident in Ichhapuram of Srikakulam district destroyed the lives of the newlyweds. They shattered the dreams vertically. The green leaves are not dry. Wedding bhajantris are ringing in the ears. The family members are in tears after the couple, who wanted to do Kapuram together forever, died on the third day of their marriage. Venu from Ichhapuram and Pravallika from Odisha got married four days ago on the 10th of this month in Simhachalam. On the 12th, a dinner was organized at Ichhapuram.
Amidst the Bhaja Bhajantris and the blessings of relatives, the newlywed couple left Ichchapuram for their mother-in-law's house in Odisha, carrying the happiness wrapped up in it.
Pravallika died on the spot when the tractor coming from behind hit the bike on which the newlyweds were traveling. The groom Venu also breathed his last before being admitted to the hospital. This tragic incident plunged the two families into an ocean of grief.
Telugu version
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నూతన వధూవరుల నూరు వసంతాల జీవితాన్ని సర్వనాశనం చేసింది. వారు కన్నకలలను నిలువునా కుప్పకూల్చివేసింది. పచ్చని పారాణింకా ఆరలేదు. పెళ్ళి భజంత్రీలు చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. కలకాలం కలసి కాపురం చేయాలనుకున్న జంట పెళ్ళి అయిన మూడో రోజే మృత్యువాతపడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇచ్ఛాపురంకి చెందిన వేణు, ఒడిశాకు చెందిన ప్రవల్లికలకు నాలుగు రోజుల క్రితం ఈనెల 10 వతేదీన సింహాచలంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 12వ తేదీన ఇచ్ఛాపురంలో విందు ఏర్పాటు చేశారు.
భాజా భజంత్రీల మధ్య, బంధుమిత్రుల ఆశీర్వాదాల మధ్య మూటగట్టుకున్న ఆనందాన్ని మోసుకుంటూ ఇచ్ఛాపురం నుంచి ఒడిశాలోని అత్తగారింటికి బయలుదేరిన ఈ నవ జంట స్వప్నాలను చిదిమేసింది ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యుశకటం.
నవ వధూవరులు ప్రయాణిస్తోన్న బైక్‌ని వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రవల్లిక మృత్యువాత పడ్డారు. ఆసుపత్రికి చేర్చేలోపు వరుడు వేణు కూడా తుది శ్వాస విడిచారు. ఈ విషాద ఘటన ఆ రెండు కుటుంబాలను దుఃఖసాగరంలో ముంచేసింది.