Telangana TET Exam Results 2022

English Version

The results of the Telangana Teacher Eligibility Test (TS TET 2022) will be released on Friday (July 1). State Education Minister Sabita Indrareddy will release the results at 11:30 am. It is learned that the TET Final Key has already been released. Education officials are making all arrangements to announce the results today in Ikram. A total of 3,18,506 candidates appeared for Paper-1 and 2,51,070 for Paper-2 in the TET examination held on June 12. Officials said the results would be announced on June 27, just in time for the release of the notification. However, the TET convener announced that the release of the results would be delayed under the current circumstances. Mentioned that it would take some more time after that. Recently, however, Education Minister Sabita Indrareddy clarified the release of the TET results. It has been clarified that the results will be announced on July 1.

The primary key for the TET exam was released on the 15th of this month. The TET final key was released by the authorities on June 29. While adding marks to some questions in this key .. Double answers were given to some other questions. Combined 4 marks in Paper-1 .. Two answers were found for another 4 questions. Made changes to a total of 8 questions. When it comes to Paper 2 .. Mathematics, Science and Social Studies key four marks combined .. Two answers to another question were found. The TET has been held three times since the formation of Telangana as a separate state. Candidates, however, point out that the pattern of questions is easier this time as compared to the past. With this it seems likely that a large number will qualify for the TET‌ exam this time around. After the declaration of results, candidates can check their TET results on the official website https://tstet.cgg.gov.in/

Telugu Version

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) ఫలితాలు శుక్రవారం (జులై 1) విడుదలకానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఉద‌యం 11:30 గంట‌ల‌కు ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటికే టెట్‌ ఫైనల్‌ కీ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో నేడు ఫలితాలు ప్రకటించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 12న నిర్వహించిన టెట్‌ పరీక్షలో పేపర్‌-1కు 3,18,506, పేపర్‌-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా నోటిఫికేషన్ విడుదల సమయంలోనే ఫలితాలను జూన్ 27న ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఫలితాల విడుదల ఆలస్యం కానున్నట్లు టెట్ కన్వీనర్ ప్రకటించారు. ఆ తర్వాత మరింత కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. అయితే తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెట్‌ ఫలితాల విడుదలపై స్పష్టత ఇచ్చారు. జులై 1న రిజల్ట్స్‌ను ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు.

కాగా టెట్‌ పరీక్షకు సంబంధించి ఈ నెల 15న ప్రైమరీ కీ విడుదలవగా.. జూన్ 29న టెట్ ఫైనల్ కీని అధికారులు రిలీజ్‌ చేశారు. ఈ కీలో కొన్ని ప్రశ్నలకు మార్కులను కలుపగా.. మరికొన్ని ప్రశ్నలకు డబుల్ ఆన్సర్స్‌ ఇచ్చారు. పేపర్ -1లో 4 మార్కులను కలపగా.. మరో 4 ప్రశ్నలకు రెండు సమాధానాలను గుర్తించారు. మొత్తంగా 8 ప్రశ్నలకు మార్పులు చేశారు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే.. మ్యాథమేటిక్స్ , సైన్స్ మరియు సోషల్ స్టడీస్ కీలో నాలుగు మార్కులను కలుపగా.. మరో ప్రశ్నకు రెండు సమాధానాలు గుర్తించారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు టెట్ ను నిర్వహించారు. అయితే గతంలో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి సులువుగా ఉందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ సారి అధిక సంఖ్యలో టెట్‌ పరీక్షలో అర్హత సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులు తమ టెట్‌ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.in/ లో చెక్‌ చేసుకోవచ్చు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens