English Version
Telangana 10th class exam results released. Telangana Education Minister Sabitha Indra Reddy released the results on Thursday. In these exams too, girls have excelled. Overall 90 percent passed. Students can check the results directly on TV9 Telugu website as well as official website. For the past two years, the government declared the students to have passed directly due to Corona.. This time the exams were conducted as usual. However, instead of 11 papers, the exam has been reduced to 6 papers in order not to stress the students. The syllabus has also been reduced by 30 per cent and the choice of question papers has been increased. Meanwhile, 90 percent of students have passed the results of the tenth class examination released this year. Like last year, this time also the girls' Havane continued. Most of the girls passed. This year a total of 5,03,579 students appeared for the TEN exams and 4,53,201 passed. 90 percent pass percentage this year.
Telugu Version
తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో కూడా బాలికలే సత్తాచాటారు. మొత్తం మీద 90 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు ఫలితాలను నేరుగా అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా విద్యార్థులను నేరుగా ఉత్తీర్ణులుగా ప్రకటించిన ప్రభుత్వం.. ఈసారి యథావిథిగా పరీక్షలను నిర్వహించారు. అయితే విద్యార్థులు ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతో 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ పెంచారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదిలాగే ఈ సారి కూడా అమ్మాయిల హవానే కొనసాగింది. అత్యధికమంది బాలికలే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మొత్తం 5,03,579 విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకాగా 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 90 శాతం మంది ఉత్తీర్ణత శాతం సాధించారు.