Tasty Chicken Pakodi Recipe in Telugu & English

Chicken Pakodi

We usually eat chicken curry and chicken biryani at home. But like peanut flour pakodi with chicken, you can also add chicken pakodi and enjoy their taste. Moreover, these chicken pakodi are a little crunchy and a little soft. But there are some tips to keep it tasty and crunchy. Let's see what they are. Also let's know how to make chicken pakodi here.

Ingredients Required

Chicken - 1/2 kg (cut into small pieces), Garlic paste - 1 tbsp, Lemon - 1 (large), Chili - 2 tbsp, Salt – enough to taste, Garam masala - 1 tbsp, Roasted Cumin – 1 tbsp, Curry powder - a little (two sprigs), Coriander powder - a little, Rice flour - 2 tbsp, Peanut flour - 2 tbsp

Method of Preparation

First take the chicken pieces and clean them well. Then keep the pieces in salt water for 30 minutes. Keeping the pieces in salt water will make the pieces soft. After 30 minutes, take the pieces out of the water and put them in another bowl. Take the mixture in a bowl and add garlic paste, salt, chilli powder, garam masala powder, lemon juice and roasted cumin powder to it and mix well. Salt water has chunks in it, so make sure to add enough salt to taste. Then add coriander leaves and curry leaves and mix once. After that add rice flour and gram flour and mix again.

Keep the mixture in the fridge for at least an hour. By keeping this, the chicken pieces will be soft and crispy. After an hour take a pan and add enough oil and heat it. After the oil is heated, keep the stove on medium flame and fry the chicken pieces in small pieces. If the flame is high, the chicken pieces will get colored but the pieces inside will not be cooked. Fry the pieces well in oil and take them out in a plate.
That's it, hot and crispy tasty chicken pakodi is ready.

Telugu Version

మనం ఇంట్లో సాధారణంగా చికెన్ కూర , చికెన్ బిర్యాని చేసుకుని తింటాము . కానీ చికెనుతో శెనగపిండి పకోడీలు వేసినట్టు చికెన్ పకోడీలు కూడా వేసుకొని వాటి రుచిని ఆస్వాదిస్తూ తినవచ్చు . అంతేకాకుండా ఈ చికెన్ పకోడీలు కొంచెం కరకరలాడుతూ కొంచెం మెత్తగా బావుంటాయి . ఐతే ఇలా టేస్టీగా , కరకరలాడుతూ ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాము . అలాగే చికెన్ పకోడీ తయారీ విధానం కూడా ఇక్కడ తెలుసుకుందాము .

కావలసిన పదార్ధాలు

చికెన్ - 1/2 కేజి ( చిన్న చిన్న ముక్కలు)
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
నిమ్మకాయ - 1 ( పెద్దది)
కారం - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
గరంమసాలా - 1 టేబుల్ స్పూన్
వేయించిన జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు తరుగు - కొంచెం(రెండు రెబ్బలు)
కొత్తిమీర తరుగు - కొంచెం
బియ్యపుపిండి - 2 టేబుల్ స్పూన్లు
శెనగపిండి - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

ముందుగా చికెన్ ముక్కల్ని తీసుకుని , వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత ఆ ముక్కల్ని 30 నిమిషాలు పాటు ఉప్పునీటిలో ఉంచాలి. ఇలా ముక్కల్ని ఉప్పునీటిలో ఉంచడం వలన ముక్క మెత్తగా వస్తుంది. 30 నిమిషాలు అయ్యాక నీటిలో నుంచి ముక్కల్ని తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి . గిన్నెలో మిశ్రమాన్ని తీసుకొని , వాటికి అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరంమసాలా పొడి, నిమ్మకాయ రసం, వేయించిన జీలకర్ర పొడి వేసి, ముక్కలకి బాగా పట్టించి కలుపుకోవాలి . ఉప్పు నీటిలో ముక్కలు ఉన్నాయి కాబట్టి, రుచికి తగినంత ఉప్పును చూసుకుని వేసుకోవాలి. తరువాత కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసి ఒకసారి కలపాలి. ఆ తర్వాత బియ్యంపిండి , శెనగపిండి కూడా వేసి ఇంకోసారి కలుపుకోవాలి.
ఇలా కలిపిన మిశ్రమాన్ని కనీసం ఒక గంట సమయం ఫ్రిజ్లో ఉంచాలి. ఇలా ఉంచడం వలన చికెన్ ముక్కలు మెత్తగా , కరకరలాడుతూ ఉంటాయి . గంట తరువాత ఒక కళాయి తీసుకుని తగినంత నూనె వేసి వేడిచేయ్యాలి. నూనె వేడయ్యాక స్టవ్ మీడియం మంట మీద ఉంచి, చికెన్ ముక్కల్ని చిన్నగా వెయ్యాలి. మంట ఎక్కువ పెడితే చికెన్ ముక్కలు రంగు వస్తాయి..కానీ లోపల ముక్కలు ఉడకవు. ముక్కలు నూనెలో బాగా వేగాక వాటిని తీసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి.
అంతే వేడి వేడిగా కరకరలాడే టేస్టీ చికెన్ పకోడి రెడీ .

 

 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens