తాప్సీ పన్ను గొప్ప మనసు – ముంబయి మురికివాడల పేదలకు ఫ్యాన్లు, కూలర్లు ఉచితంగా పంపిణీ
బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మళ్లీ తన మంచి మనసును చాటుకున్నారు. వేసవి వేడి భరించలేక ముంబయిలోని మురికివాడల పేద ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, తాప్సీ వారి కోసం ప్రత్యేకంగా ఫ్యాన్లు మరియు కూలర్లు ఉచితంగా పంపిణీ చేశారు.
తన భర్త మథియాస్ బో (Mathias Boe) తో కలిసి, హేమకుంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాప్సీ స్వయంగా మురికివాడల పేదల ఇళ్లకు వెళ్లి ఫ్యాన్లు, కూలర్లు అందించారు.
తాప్సీ మాట్లాడుతూ –
"మనకు ఫ్యాన్ లేదా కూలర్ లాంటివి సాధారణ విషయాలు. కానీ పేదవారికి ఇవి ఎంతో అవసరం. ఒక చిన్న గాలే వారికి ఉపశమనం కలిగిస్తుంది. ప్రజలతో కలిసి ఉండటం, వారి బాధను అర్థం చేసుకోవడమే నిజమైన మానవత్వం." అని చెప్పారు.
ఇప్పటికే ఈ సేవా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు తాప్సీని గణంగా ప్రశంసిస్తున్నారు. "తాప్సీ ఒక మంచి నటి మాత్రమే కాదు, మంచి మనిషి కూడా" అని కామెంట్లు చేస్తున్నారు.
హేమకుంట్ ఫౌండేషన్ డైరెక్టర్ హర్తీరత్ సింగ్ మాట్లాడుతూ, "40 డిగ్రీల వేడిలో మురికివాడల జీవితం చాలా కష్టంగా మారింది. ఇది వారికి కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం." అని తెలిపారు.