Turn Depression into inspiration of my life - Smt.I.Sree Thanuja | Nari Shakti - Empowering Women | Mana Voice

నా పేరు తనూజ. మా ఊరు నంద్యాల. నేను MBA చదివాను. మా నాన్న ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. అమ్మ గృహిణి. నాకు ఒక అక్క.

MBA చదువుతున్న సమయంలో నే కొన్ని కారణాల వలన నేను ఒక MNC Company లో ఉద్యోగం కూడా చేశాను.

2013 లో నాకు వివాహం జరిగింది. ఆ తర్వాత మేము కర్ణాటక లో సెటిల్ అయ్యాం, అలా 4సంవత్సారాలు కేవలం గృహిణి గా మాత్రమే ఉండి పోవాల్సి వచ్చింది. చిన్న బాబు పుట్టిన తర్వాత కాలిగా ఉండలేక మొదట ఆన్లైన్ లో Reselling స్టార్ట్ చేసాను. అది చేస్తూనే  Chrochet Work (woolen తో రకరకాల వస్తువులు) నేర్చుకున్నాను. Time pass కి, సరదాగా నేర్చుకున్న ఒక కళ వలన అనుకొని గుర్తింపు వచ్చింది. అదేంటంటే Chrochet లో రెండు సార్లు  Guiness World Record సాధించాను.

ఆ క్రమంలో అనుకోకుండా నా కుడి కాలు లిగమెంట్ tare అయింది. ట్రీట్మెంట్ ఎక్కడ ఎక్కడో తిరిగి చాలా ఖర్చు పెట్టాం. అయినా ఎటువంటి ప్రయోజనం లేదు. చివరికి డాక్టర్స్ life-long ఇది ఇంక ఇంతే. నువ్వు కాలు మడవకూడదు, కింద కూర్చో కూడదు, ఎక్కువ సేపు నిలబడకూడదు అని చెప్పారు.
అప్పటికి నా ఇద్దరి పిల్లలు చాలా చిన్నవాళ్లు. వాళ్లు ఇంత చిన్న వయస్సులోనే నేను ఇలా అయిపోవడం నన్ను బాగా కృంగ దీసింది, అదే సమయంలో అనుకోకుండా మా నాన్న శివైక్యం అయ్యారు. అలా నేను అన్ని ఆలోచిస్తూ విపరీతమైన depression కి గురికావడం జరిగింది. దానితో మైగ్రేన్ తలనొప్పి రావడం, binge eating disorder వలన బరువు పెరగటం తో పాటు, శరీరంలో కొవ్వు శాతం బాగా పెరిగి పోయాయి. అప్పుడు మా సన్నిహితుల సలహా మేరకు యోగ మొదలు పెట్టాను. యోగ తో నాకు ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు తీరిపోయాయి. జీవితాంతం కిందే కుర్చోలేను అనుకున్న నేను ఇప్పుడు 108 సూర్యనమస్కారాలు కూడా చేయగలుగుతున్నాను.

ఆ మార్పు నాలో రావడం నాకే చాలా నచ్చింది. దానితో ఎందుకు నేను ఈ విద్య నేర్చుకొని నా లాంటి వాళ్లకు అందుబాటు ధరలో సహయపడకూడదు అని ఆలోచించి దాదాపు గా 2 Years యోగా లో రకరకాల విద్య లు నేర్చుకున్నాను. అందులో ముఖ్యంగా Face Yoga నాకు ఎనలేని గుర్తింపు ను తెచ్చి పెట్టింది. ఒకసారి dd యాదగిరి ఛానల్ లో ఇంటర్వూ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రోజు నేను 3గంటలు యోగ, 2 గంటలు ఫేస్ యోగ, 2గంటలు Therapatic యోగ, 1 గంట Kids Yoga Teach చేస్తున్నాను. ఈ యోగ విద్య తో పాటు Clinical Nutrition కూడా చేసి నా Clients కి వారి వారి అనారోగ్యాలకు అవసరమైన విధంగా diet కూడా సూచిస్తున్నాను.

ఉచితంగా ఈ విద్య బోధించాలి అని నాకు ఉన్న మా నాన్న అకాల మరణం తో అమ్మ బాధ్యత , ఆర్థిక సమస్యల వలన ఒకరి దగ్గర చేయి చాచడం ఇష్టం లేక కేవలం అతి తక్కువ ఫీజు ల తో నేను ఈ విద్య బొదిస్తున్నాను. నా clients ఇచ్చే డబ్బు కంటే వాళ్లు వాళ్ల  అనారోగ్య సమస్యల నుంచి బయట పడినప్పుడు వాళ్లు చెప్పే కృతజ్ఞతలే నాకు అధిక సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

దీనితో పాటు అప్పుడప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ కి ఉపయోగపడే లా చిన్న చిన్న write-ups నా స్వంత అనుభవాలతో రాస్తూ ఉంటాను. అవి కూడా నా clients కి బాగా ఉపయోగపడటమే కాక నన్ను వాళ్లకు మరింత దగ్గర చేశాయి

అలా depression తో నాలుగు గోడల మధ్య ఎప్పుడూ చీకటిలో ఉండే నేను నా సంకల్ప బలం, నా భర్త సహకారం తో ఇవాళ ఒకరికి inspiration గా మారడం నాకు చాలా ఆనదంగా ఉంది


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens