Secunderabad Rangam Bhavishyavani 2022 | Mathangi Swarnalatha

The Bonala festival is held in grandeur in the twin cities. Devotees are paying prayers with devotion. A 'Rangam' program was organized as part of the Mahakali bonas of Ujjain, Secunderabad. Jogini heard the golden prophecy. In Bhavishyavani, she expressed her anger on the way of worship. Will you change my appearance as you like? In how many forms will I be transformed? Change it to your liking? I want to measure in a consistent form. Keep my form steady. Make arrangements for the devotees to visit me with their eyes. Do not worship in the sanctum sanctorum.. worship scientifically. Pujas are not being performed properly in my temple. They are worshiping when something is offered. Put your hand on your heart and say how happy you are worshiping. The pooja you are doing is for your happiness and not for me. You don't have much to do. Everything is what I got. They are treating me like thieves. "I have shown my anger in the form of rains for your mistakes," Swarnalatha Bhavishyavani said.

Telugu Version

జంట నగరాలలో బోనాల పండగ వైభంగా జరుగుతుంది. భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి బోనాల్లో భాగంగా ‘రంగం’ కార్యక్రమం నిర్వహించారు. జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పూజా విధానంపై భవిష్యవాణిలో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా రూపాన్ని మీ ఇష్టం వచ్చినట్లు మారుస్తారా..? ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు? మీకు నచ్చినట్టు మారుస్తారా? స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా. నా రూపాన్ని స్థిరంగా నిలపండి. భక్తులు నన్ను కనులారా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయండి. గర్భాలయంలో మొక్కుబడిగా వద్దు.. శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. నా గుడిలో పూజలు సరిగా జరిపించడం లేదు. ఏదో మొక్కుబడిగానే పూజలు చేస్తున్నారు. ఎంత సంతోషంగా పూజలు చేస్తున్నారో మీ గుండెపై చేయి పెట్టి చెప్పండి. మీరు చేస్తున్న పూజలు.. మీ సంతోషానికే తప్ప నాకోసం కాదు. మీరు పెద్దగా చేసేది లేదు. అంతా నేను తెచ్చుకున్నదే. దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు. మీరు చేసే తప్పుల విషయంలో నా ఆగ్రహాన్ని వర్షాల రూపంలో చూపించాను’’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens