విక్టరీ వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్‌గా మారింది. ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ కథానాయికలుగా నటించారు.
ఇటీవల ఈ చిత్రం టీవీతో పాటు ఓటీటీలో విడుదలైంది. టీవీ ప్రీమియర్ ఈ చిత్రానికి సరికొత్త రికార్డులను సృష్టించింది. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్లో ఈ చిత్రం టెలికాస్ట్ అయింది. ఈ చిత్రం 15.92 రేటింగ్‌ను సాధించింది. ఈ రేటింగ్ కేవలం జీ తెలుగు ఎస్డీ ఛానల్స్‌కు సంబంధించినది. జీ తెలుగు హెచ్డీలో 2.3 రేటింగ్ వచ్చాయి. మొత్తంగా 18కి పైగా రేటింగ్‌లు నమోదు అయ్యాయి.
మార్చి 1న సాయంత్రం 6 గంటలకు ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. మొదటి 12 గంటల్లోనే ఈ చిత్రం 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను నమోదు చేసింది. ఆర్ఆర్ఆర్, హనుమాన్ వంటి సినిమాల రికార్డులను కూడా ఈ చిత్రం బద్దలుకొట్టింది. 200 మిలియన్లు, 300 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డులను కూడా ఈ చిత్రం సాధించింది.