ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా.. ఆమె ఎవరు?

ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్‌గా మూడేళ్ల పాటు నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జనవరిలో మైఖేల్ దేబబ్రత పాత్ర రాజీనామా చేసిన తర్వాత ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. కేబినెట్ నియామకాల కమిటీ (ACC) గుప్తా నియామకాన్ని ఆమె బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి మూడు సంవత్సరాల పాటు ఆమోదించింది.

ప్రస్తుతం, గుప్తా NCAER డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఆమె ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు మరియు 16వ ఆర్థిక సంఘం సలహా మండలి కన్వీనర్ కూడా. 2021లో NCAERలో చేరకముందు, ఆమె దాదాపు రెండు దశాబ్దాల పాటు వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మరియు ప్రపంచ బ్యాంకులో సీనియర్ పదవుల్లో పనిచేశారు. గుప్తా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ (USA)లో బోధించారు. ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ISI)లో విజిటింగ్ ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు.

ఆమె నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP)లో RBI చైర్ ప్రొఫెసర్‌గా, ICRIERలో ప్రొఫెసర్‌గా కూడా ఉన్నారు. గుప్తా అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్‌డీ, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1998లో అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రంపై పిహెచ్‌డి చేసినందుకు ఆమె ఎగ్జిమ్ బ్యాంక్ బహుమతిని పొందారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షెడ్యూల్ ప్రకారం, మొదటి MPC సమావేశం ఏప్రిల్ 7-9 మధ్య జరగనుంది. RBI 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య విధాన సమావేశాల పూర్తి షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens