Rain forecast for Telangana.. Thunder and lightning rains in next 5 days.

The Meteorological Department of Hyderabad has said that rain is likely to occur in many districts across Telangana in the next five days.

 It has been said that there is a possibility of moderate rain with thunder, lightning and gusty winds in many districts. The sky will be partly cloudy with light to moderate or thundershowers during the evening or night hours, officials said.

Officials said that Droni, which was moving from Jharkhand to Telangana via Chhattisgarh, moved towards Odisha on Wednesday and winds were blowing from east and south-east towards the state, due to which rains are likely. As part of this, the Meteorological Department has issued a yellow alert. Meanwhile, the Meteorological Department has said that there is a possibility of rain in ten districts of Telangana today.

On Thursday..Thunder, lightning, gusty winds and hail are likely to occur here and there in Nizamabad, Jagityala, Rajanna Sirisilla, Siddipet, Yadadri-Bhuvanagiri, Rangareddy, Hyderabad, Medchal Malkajigiri, Medak and Kamareddy districts. Also on Friday, Saturday and Sunday there will be thunder, lightening, gusty winds and hailstorm in Kumrambhim Asifabad, Manchiryala, Rajanna Sirisilla, Karimnagar, Peddapalli, Jayashankar Bhupalapalli, Mulugu, Mahabubabad, Warangal, Hanumakonda, Yadadri-Bhuvanagiri, Rangareddy, Hyderabad, Medchal Malkajigiri districts. The weather center has revealed that there is a chance of rain.

Telugu version

రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మెస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. రానున్న 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి బుధవారం ఒడిశా వైపు కదిలిందని, తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు, ఈ కారణంగానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇదిలా ఉంటే తెలంగాణలో పది జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

గురువారం.. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శుక్ర, శని, ఆదివారాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens